NEWS

Viral Video: ప్రాణం తీసిన ట్రోలర్లు! ఆత్మహత్య చేసుకున్న పసికందు తల్లి!

చర్య.. ప్రతిచర్య (image credit - x - @BellamSwathi) కొన్ని వారాల కిందట.. చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ టిన్ రూఫ్ నుంచి పసికందు జారి పడిపోతుంటే.. లక్కీగా స్థానికులు.. ఆ పసికందును అతి కష్టమ్మీద కాపాడారు. ఐతే.. ఆ చిన్నారి తల్లి.. ఆదివారం కోయంబత్తూర్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో శవమై కనిపించింది. ఏప్రిల్ 28న చెన్నై.. అవాడీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పసికండు జారిపడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో 8 నెలల పసికందు.. ఓ ప్లాస్టిక్ షీట్‌పై మెల్లగా జారుతూ ఉంటే.. అది గమనించిన చుట్టుపక్కల వారు.. కింద దుప్పట్లు, బెడ్‌షీట్లను పట్టుకున్నారు. తద్వారా పసికందు జారిపడితే.. వాటిలో పడేలా ప్లాన్ చేశారు. అలాగే.. కొంతమంది అపార్ట్‌మెంట్ గోడలు, కిటికీలు ఎక్కి.. చివరకు చిన్నారిని కాపాడగలిగారు. This happened in chennai 🫡 that white banian man A true hero But in US firefighters would arrive in 2 min and rescue the child Btw how did the child land there ? pic.twitter.com/7VDhu26qfb ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పసికందును కాపాడిన వారిని మెచ్చుకున్నారు. అదే సమయంలో.. పసికందు తల్లి రమ్య నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమెపై ట్రోల్స్ చేశారు. ఐతే.. స్థానికులు దీనిపై స్పందిస్తూ.. ఆ తల్లి.. పసికందును ఎప్పుడూ బాగా చూసుకుంటుందనీ, ఈ ఘటనలో ఆమె తప్పేమీ లేదనీ, అనుకోకుండా ఇది జరిగిందని చెప్పారు కూడా. అయినా ట్రోలర్లు ఆమెను తిట్టిపోశారు. తాజాగా రమ్య ఆ చిన్నారిని తీసుకొని.. కరామదాయ్ లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం ఆమె ఆ ఇంట్లోనే అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందిస్తూ.. నటుడు ప్రశాంత్ రంగస్వామిపై మండిపడ్డారు. ఆమెను తిట్టడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ప్రశాంత్ లాంటి వ్యక్తులు, అలాగే ఈ ట్వీట్ కింద ఎవరైతే తల్లిదండ్రులను అవమానించారో, వారంతా ఇప్పుడు పండుగ చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది" అని సెటైరికల్ ట్వీట్ చేశారు. People like @itisprashanth and those who have shamed the parent/s under this Tweet All these human creations can perhaps celebrate now since the mother of this child has now killed herself. మొత్తానికి ఈ ఘటన ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే దానిపై క్లారిటీ లేదు. ట్రోల్స్ భరించలేకే ఆత్మహత్య చేసుకుందా లేక.. మరేదైనా కారణం ఉందా అన్నది పోలీసులే తేల్చాలి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.