NEWS

Love Story: డాన్ కూతురితో 13 ఏళ్లు సీక్రెట్ లవ్.. ఈ టీమిండియా స్టార్ లవ్‌స్టోరీ తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం Sunil Chhetri: కొంతమంది సెలబ్రిటీల లవ్ స్టోరీస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది లవ్, డేటింగ్ చేస్తారు కానీ పెళ్లి చేసుకోరు. కొందరు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రొమాంటిక్ సినిమాలకు తీసిపోని విధంగా ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటారు. తాజాగా ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి, తన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని బయట పెట్టాడు. తాను, తన భార్య సోనమ్ భట్టాచార్య 13 ఏళ్లు ప్రేమించుకున్నట్లు తెలిపాడు. ఆమె కోల్‌కతాలో ఒక డాన్ లాంటి పాపులారిటీ ఉన్న ఫుట్‌బాల్ కోచ్ కూతురు కావడం విశేషం. సునీల్ ఛెత్రి 18 ఏళ్ల వయసులో “మోహన్ బాగాన్” ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఆడుతుండేవాడు. ఆ సమయంలో కోచ్ సుబ్రతా భట్టాచార్య దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాడు. అలా లైఫ్ గడిచిపోతున్న సమయంలో సునీల్‌కు సుబ్రతా కూతురు సోనమ్‌ పరిచయమైంది. వారి పరిచయం స్నేహం, ఆపై ప్రేమకు దారి తీసింది. 13 ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత, సోనమ్‌ను పెళ్లి చేసుకోవాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులను తీసుకెళ్లకుండా, సోనమ్ నాన్నను కలిసి “మీ కూతురిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా” అని చెప్పాడట. ‘ది లాలాంటాప్’ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ చెత్రీ మాట్లాడుతూ.. “సోనమ్ తండ్రిని కలవడానికి బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్లాను. సోనమ్ తండ్రి సుబ్రతా భట్టాచార్య చాలా గొప్ప క్రీడాకారుడు. ఆయన అర్జున అవార్డు గ్రహీత కూడా. సోనమ్‌ను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆయనకు నేను చెప్పాలనుకున్నా. అందుకే చాలా ఫార్మల్ డ్రెస్ ధరించి అతని వద్దకు వెళ్లాను. సాధారణంగా మాట్లాడే బెంగాలీ కాకుండా ఇంగ్లీషులో మాట్లాడాను.” అని చెప్పుకొచ్చాడు. ఒంటరిగా వెళ్లి.. “నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి, సోనమ్‌ తండ్రితో మా ప్రేమ గురించి చెప్పబోతున్నానని చెప్పాను. వారు నన్ను ఆశీర్వదించారు. మమ్మల్ని కూడా రమ్మంటావా అని వాళ్లు అడిగారు. కానీ నేను ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అక్కడికి వెళ్లిన తర్వాత మేం నా ఆట గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సమయంలో సోనమ్ గురించి ప్రస్తావించడానికి అవకాశం కోసం చూశాను. అప్పుడు సుబ్రతా భట్టాచార్య తన కొడుకు షాహెద్‌ను పిలిచి, నాకు షార్ట్స్ తీసుకురావాలని చెప్పారు. ఎందుకంటే నేను ఫార్మల్స్ వేసుకుని వెళ్లా. ‘ఇంత ఉదయాన్నే ఇతను ఇవి ఎందుకు వేసుకున్నాడు?’ అని షాహెద్ నన్ను చూస్తూ ఉండగా, నేను కూడా అతన్ని చూస్తూ ఉండిపోయా. నేను ఎందుకు వచ్చానో అతనికి అర్థమైంది.” అని సునీల్ చెత్రీ చెప్పుకొచ్చాడు. “ఆయన మాట్లాడటం ఆపినప్పుడు, నేను ఆయనతో ఇంగ్లీషులో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. సాధారణంగా నేను ఆయనతో బెంగాలీలోనే మాట్లాడుతుంటాను. ‘కోచ్, నేను మీతో సోనమ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను’ అని ఇంగ్లీషులో చెప్పా. అప్పుడు ఆయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ‘నాకు సోనమ్ 13 ఏళ్లుగా తెలుసు, ఐ ట్రూలీ లవ్ హార్’ అని చెప్పుకుంటూ పోయాను. సోనమ్ మా 13 ఏళ్ల లవ్ గురించి చెప్పొద్దని నాకు మరీ మరీ చెప్పింది. కానీ నేను తర్వాత చెప్పిన మొదటి విషయమే అదే. చివరగా ఆయన ఆశీర్వాదం కోరాను. ఆయనేం మాట్లాడకుండా వెంటనే బాత్రూమ్‌కు వెళ్ళిపోయారు. షాహెద్, నేను అక్కడే నిలబడి, ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. ఆయన బయటకు వచ్చినప్పుడు నా కళ్ల వైపు చూడలేదు.” అని చెప్పుకొచ్చాడు. ఒప్పుకున్న తండ్రి అలాంటి పొజిషన్‌లో అతన్ని ఉంచినందుకు తాను ఎంతో బ్యాడ్‌గా ఫీల్ అయ్యానని సునీల్ చెప్పాడు. అంతలోనే సుబ్రతా భట్టాచార్య అతన్ని అల్లుడుగా ఒప్పుకుంటునట్లు సరే ‘మీ అమ్మను, మీ అత్తయ్య లతను తీసుకురా, మాట్లాడదాం.’ అని చెప్పాడు. ఆ తర్వాత పెద్దలు మాట్లాడుకోవడం, వీళ్లు హ్యాపీగా పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. సోనమ్‌, సునీల్ పెళ్లి చేసుకుని ఐదేళ్ల అవుతోంది. ఈ దంపతులకు ఒక మగ బిడ్డ పుట్టాడు. అతని పేరు ధృవ్. “మా ప్రేమ కథలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను 13 ఏళ్లుగా అర్జున అవార్డు గ్రహీత అయిన ఒక వ్యక్తి కూతుర్ని ప్రేమించాను. ఆయన కోల్‌కతాలో ఒక డాన్ లాంటివారు. అయినా, నేను ఆయన కళ్లు గప్పి ఆయన కూతుర్ని 13 ఏళ్లు లవ్ చేశా.” అని సునీల్ గొప్పగా చెప్పుకున్నాడు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.