NEWS

సమస్త దేవతల ఆశీస్సులు మీపై ఉండాలా.. శ్రావణమాసంలో ఈ ఒక్క పూజ చేస్తే సరి

మాసాలలో శ్రావణమాసం విశిష్టమైనది. హిందూ సనాతన ధర్మం ప్రకారం తెలుగు మాసాల్లో శ్రావణమాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఆధ్యాత్మికంగా శ్రావణాన్ని చాలా పవిత్రమైన మాసంగా చెబుతారు. శ్రావణం వచ్చిందంటే ప్రతి ఇంటిలోనూ ఆధ్యాత్మికత వెల్లి విరుస్తుంది. అన్ని మాసాలలో ఉత్తమమైనటువంటి మాసం శ్రావణమాసమని, ఆషాడంలో తొలి ఏకాదశి నుంచి మొదలుకొని ఆ తర్వాత వచ్చేటటువంటి అమావాస్య రోజున శ్రావణమాసం ప్రారంభం అవుతుందని అర్చకులు షణ్ముఖ శర్మ లోకల్ 18కు వివరించారు. అర్చకులు తెలిపిన వివరాల మేరకు.. శ్రావణానికి వేదంలో చెప్పినటువంటి పేరు నభోమాసం అని అంటారు. శ్రావణమాసంలో ప్రతిరోజు ప్రతి దేవతలను కొలుచుకోవచ్చు. శ్రావణమాసంలో శివారాధన చేయడం విశేషంగా భావిస్తారు. ఎందుకంటే ఆ శివుడు బోలా శంకరుడు. ఏ కోరిక కోరిన ఇచ్చేటటువంటి ఆ పరమశివుడు శ్రావణమాసానికి చాలా అధిపతి అయినటువంటి దేవుడు.అందుకే శ్రావణమాసంలో మొదటగా శివార్చన చేయాలని శాస్త్రం చెబుతుంది. దానికి తోడు ఈ సంవత్సరం శ్రావణమాసం కూడా సోమవారంతోనే ప్రారంభం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మాసంలో అనేక రకాల పండుగలు వస్తుంటాయి. వేదాన్ని ప్రతిపాదించేటువంటి కర్మలన్నీ ఇందులో వస్తాయి. చుక్కల అమావాస్య, మంగళ గౌరీ వ్రతం, నాగుల పంచమి, వరలక్ష్మి శుక్రవారం ఇలా అనేకమైనటువంటి పర్వనిధానాన్ని శ్రావణమాసంలోనే ఉత్పన్నమవుతాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం సమస్త దేవతలందరూ శ్రావణమాసాన్నే అధిరోహించుతారు. ఈ శ్రావణ మాసంలో పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలను ఇస్తాయి. శివునికి శివార్చన చేయడం, శుక్రవారం వరలక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం ఇందులో శుక్రవారం చాలా పవిత్రమైనది. మహిళలు వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం ద్వారా సౌభాగ్యాన్ని పొందుతారు. పసుపు, కుంకుమ, గాజులు, పూలు ముత్తైదువుకు కావలసినటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఈ వరలక్ష్మీ వ్రతం నాడు ఆచరించి స్త్రీమూర్తులంతా ఒకరికి ఒకరు పంచుకోవడం అనే సాంప్రదాయం ఈ వరలక్ష్మి వ్రతం నాడు కనిపిస్తోంది. పూర్వం చెప్పిన కథల ప్రకారం మంగళ గౌరీ వ్రతాన్ని కూడా శ్రావణమాసంలోనే ప్రారంభిస్తారు. ఈ వ్రతాన్ని నూతనంగా వివాహమైనటువంటి దంపతులు ఐదు సంవత్సరాల పాటు చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. పూర్వం ఒకానొక సమయంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు, పార్వతీ ఇద్దరు కలిసి భక్తులకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా తొలగిపోతాయని అనుకుంటుంటారు. అయితే వారు చేసేటటువంటి కర్మకు తప్పక అనుభవించాల్సిందేనని, కానీ ఆ కరుణకు కాస్త వెసులుబాటు ఉంటుంది. వారు చేసేటటువంటి దానధర్మాల వల్ల శ్రావణమాసం వారి స్థితిని మార్చుతుంది. దాంతో పాటు ఆషాడం, శ్రావణం, భాద్రపాదం, కార్తీకం వీటిని చతుర్మాసం అంటారు. గొప్పవారు కూడా ఆషాడ ఏకాదశి మొదలుకొని నాలుగు మాసాల పాటు దీక్ష చేస్తూ వారి గ్రామాన్ని పరిధి దాటకుండా అక్కడే ఉండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో సనాతనమైనటువంటి సాంప్రదాయంలో ఇదొక ఆచారం. దాని యొక్క ఫలితం కొన్ని రోజులకు కనిపిస్తుంది. అయితే శ్రావణమాసంలో చేసేటటువంటి ఈ పూజలకు మాత్రం ఫలితం అవే రోజు కనపడుతుందని ఆ సనాతనం తెలుపుతుందని అర్చకులు చెప్పుకొచ్చారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.