NEWS

Iran president video: ప్రమాదానికి ముందు హెలికాఫ్టర్ లో ఇరాన్ అధ్యక్షుడు.. వీడియో చూడండి

ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో(Chopper crash) ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi),ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్ చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత ఇరాన్ లోని తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు తాజాగా ఇరాన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ (IRCS) ప్రకటించింది. ప్ర‌మాదం జ‌రిగిన 16 గంట‌ల త‌ర్వాత హెలికాప్ట‌ర్‌కు చెందిన శిథిల భాగం ఒక‌దాన్ని స‌మీప ప‌ర్వ‌త శ్రేణుల్లో గుర్తించారు. ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ తెలిపింది. అయితే ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి ముందు హెలికాప్ట‌ర్‌లో రైసీ ఉన్న దృశ్యాలు రిలీజ్ అయ్యాయి. ఇరాన్ ప్ర‌భుత్వ మీడియా ఈ వీడియోను రిలీజ్ చేసింది. హెలికాప్ట‌ర్ కిటికీ నుంచి రైసీ బ‌య‌ట‌కు చూస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కరనడబుతున్నాయి. రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుసేన్ ఆమిర్ అబ్దుల్లాయిన్ కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నారు. చాప‌ర్‌లో వెళ్ల‌డానికి ముందు అధికారుల‌తో అధ్య‌క్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్‌లో ఉన్నాయి. హెలికాప్ట‌ర్ బ‌య‌లుదేరిన 30 నిమిషాల త‌ర్వాత దాంట్లో కాంటాక్టు పోయింది. హెలికాప్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌ను ఇరాన్ మీడియా ప్ర‌మాదంగా వ‌ర్ణించింది. ایرانی صدر ابراہیم رئیسائی کا آخری سفر، ہیلی کاپٹر حادثے سے پہلے ڈیم کے فضائی دورے کی ویڈیو۔۔!! #Iran pic.twitter.com/LOn5h1Lsdq 63 ఏళ్ల ఇబ్రహీం రైసీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలుత 2017 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన రైసీ.. హసన్‌ రౌహానీ చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత 2019లో న్యాయ వ్యవస్థ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి 2021 ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా రైసీనీ భావించేవారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.