NEWS

Viral Video: సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌తో దిగ్గజ క్రికెటర్ కూతురు.. హైదరాబాద్ బిర్యానీకి ఫిదా!

PC: Instagram ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎండింగ్ స్టేజ్‌కు వచ్చింది. మే 26వ తేదీతో ఈ సీజన్ ముగియనుంది. లీగ్ మ్యాచ్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. నాకౌట్స్ మ్యాచ్‌లు ఇంతకు మించిన కిక్ ఇవ్వనున్నాయి. అయితే ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌కు సంబంధించి బయట జరిగే కొన్ని విషయాలు కూడా ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. స్టార్ క్రికెటర్లు ఇండియాలో ప్రముఖ రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాలకు వెళ్తూ ఆశ్చర్య పరుస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కూతురు గ్రేస్ (Grace Hayden), హైదరాబాద్‌లో సందడి చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్యాన్స్‌తో కలిసి పాపులర్ “పారడైజ్ బిర్యానీ” రెస్టారెంట్‌లో బిర్యానీ టేస్ట్ చేసింది. పారడైజ్ రెస్టారెంట్‌లో సెలబ్రిటీ కిడ్ గ్రేస్ బిర్యానీ టేస్ట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. గ్రేస్ ఒక పాపులర్ కంటెంట్ క్రియేటర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 లక్ష కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమె స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌లో టీవీ ప్రెజెంటర్‌గా పనిచేస్తోంది. 21 ఏళ్ల గ్రేస్ SRH టీమ్ కలర్‌కు మ్యాచ్‌ అయ్యేలా ఆరెంజ్ డ్రెస్‌లో వచ్చి, ఫ్యాన్స్‌తో కలిసి భోజనం చేసింది. 1953 నుంచి కస్టమర్లకు సేవలందిస్తున్న పారడైజ్ బిర్యానీ రెస్టారెంట్‌లో హెడెన్ కూతురుని చూసి చాలామంది ఎగ్జైట్ అయ్యారు. Biryani in Hyderabad is an emotion! 🤌🏻 Experience the essence of Hyderabad with #GraceHayden as she indulges in the iconic Hyderabadi Biryani alongside passionate @SunRisers fans! 🍲✨ 📺 | #LSGvMI | TODAY, 6:30 PM | #IPLOnStar pic.twitter.com/l75BhuvmQT వైరల్ వీడియోలో గ్రేస్ బిర్యానీ తింటూ, SRH ఫ్యాన్స్‌ను చాలా ప్రశ్నలు అడిగింది. మీ ఫేవరెట్ SRH ప్లేయర్ ఎవరో చెప్పాలని ప్రశ్నించింది. అలానే హైదరాబాద్ జట్టు ఎలా ఆడుతోందో చర్చించింది. ఒక సమయంలో బిర్యానీ ఎలా తినాలో చెప్పాలని గ్రేస్ అడిగింది. అందరూ చేతితో తినడం మంచిదని చెప్పారు. వెంటనే ఆమె స్పూన్‌ను పక్కన పెట్టి చేతితో బిర్యానీ టేస్ట్ చేసింది. లాస్ట్‌లో డ్రైడ్ ఖుబానీలతో తయారు చేసిన ఖుబానీ-కా-మీఠా డెజర్ట్‌ను తింటూ మైమరిచిపోయింది. * హైదరాబాదీ బిర్యానీ ఒక ఎమోషన్! గ్రేస్ హైదరాబాదీ బిర్యానీ తింటున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌ అఫీషియల్ హ్యాండిల్ షేర్ చేసింది. వీడియోలో, గ్రేస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులతో కలిసి సరదాగా గడుపుతున్నట్లు చూడవచ్చు. “హైదరాబాద్‌లో బిర్యానీ ఒక ఎమోషన్! గ్రేస్‌తో కలిసి ఐకానిక్ హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదించండి, అలాగే సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌తో కలిసి హైదరాబాద్ ఎసెన్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయండి!” అని స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. * వారికి కూడా ఇష్టమే గ్రేస్ మాత్రమే కాదు, హైదరాబాద్‌కు వచ్చినప్పుడు లోకల్ బిర్యానీ రుచి చూసిన ఆస్ట్రేలియన్లు చాలా మంది ఉన్నారు. కొన్ని వారాల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్, SRH కెప్టెన్ పాట్ కమిన్స్ ఫ్యామిలీతో కలిసి ఒక హైదరాబాదీ రెస్టారెంట్‌కు వెళ్లారు. కమిన్స్ రెస్టారెంట్ నుంచి ఒక ఫొటోను షేర్ చేసి, రెస్టారెంట్ సర్వీస్‌కు థ్యాంక్స్ చెప్పారు. “హైదరాబాద్‌లో కుటుంబంతో గొప్ప రోజు. మొదటి ఇండియన్ టూర్‌లో వారికి హైదరాబాదీ బిర్యానీకి తీసుకెళ్లాల్సి వచ్చింది. బిర్యానీ చాలా రుచిగా ఉంది! సదరన్ మిర్చి మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వారం మొత్తం మేం తినాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా!" అని కమిన్స్ పేర్కొన్నాడు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.