NEWS

నిరుద్యోగులకు భారీ శుభవార్త: రైల్వేలో 1104 పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

ప్రతీకాత్మక చిత్రం నిరుద్యోగులకు శుభవార్త. గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)..నార్త్ ఈస్ట్రన్ రైల్వే (NER)పరిధిలోని వర్క్‌షాప్,యూనిట్లలో 1104 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది(RRC NER Apprentice Recruitment 2024). ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ జులై 11. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు దురుసు తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూడండి. పోస్టుల వివరాలు 1.మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్) - 411(విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-140, వెల్డర్-62, ఎలక్ట్రీషియన్-17, కార్పెంటర్-89, పెయింటర్-87, మెషినిస్ట్-16). 2.క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (లక్నో జంక్షన్) - 155(విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-120, వెల్డర్-06, ట్రిమ్మర్-06, కార్పెంటర్-11, పెయింటర్-06, మెషినిస్ట్-06) 3.మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్) - 151(విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్-39, వెల్డర్-30, ఎలక్ట్రీషియన్-32, కార్పెంటర్-39, పెయింటర్-11) 4.క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (వారణాసి) -75(విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-66, వెల్డర్-02, కార్పెంటర్-03, ట్రిమ్మర్-02, పెయింటర్-02) 5.క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్) - 64(విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్-64) 6.సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్‌) - 63(విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-31, వెల్డర్-08, టర్నర్-15, కార్పెంటర్-03, మెషినిస్ట్-06) 7.డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్) - 60(విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్-30, మెకానికల్ డీజిల్-30) 8.బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్‌) - 35(విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-21, వెల్డర్-11,మెషినిస్ట్-03) 9.డీజిల్ షెడ్ (గోండా) - 90(విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-13, వెల్డర్-02, ఎలక్ట్రీషియన్-20, మెకానిక్ డీజిల్-55) విద్యార్హత అభ్యర్థులు కనీసం 50 % మార్కులతో పదో తరగతి సహా, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 12 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100 ఎస్టీ, ఎస్సీలు,మహిళలు, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియ 10వ తరగతి, ITI పరీక్షల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. శిక్షణ వ్యవధి ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. స్టైపెండ్ ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల మేరకు శిక్షణ కాలంలో స్టైపెండ్ చెల్లిస్తారు. అప్లయ్ చేయడం ఇలా వెబ్​సైట్ ఓపెన్ చేయాలి. RRC NER Apprentice Recruitment 2024 లింక్​పై క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​ లోనే చెల్లించాలి. అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్​ను సబ్ మిట్​ చేయాలి. అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.