NEWS

ఐటీ ఇండస్ట్రీలో వీరికి ఫుల్ డిమాండ్స్.. లేటెస్ట్ సర్వేలో తేలిన షాకింగ్ నిజాలు

ప్రతీకాత్మక చిత్రం Report: ఐటీ ఇండస్ట్రీలో క్రమంగా ఉద్యోగ నియామకాలు పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో ఫ్రెషర్లకు 5% డిమాండ్ పెరిగింది. జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫారం ఫౌండ్‌ఇట్ (Foundit- గతంలో మాన్‌స్టర్ APAC & ME) విడుదల చేసిన రిపోర్ట్.. ఐటీ, స్టాఫింగ్‌ ఇండస్ట్రీలు ఫ్రెషర్లను నియమించుకోవడంలో ముందున్నాయని పేర్కొంది. ఐటీలో 32%, స్టాఫింగ్‌ ఇండస్ట్రీలో 12% జాబ్ పోస్టింగ్‌లు ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్‌కు సంబంధించి ఉంటున్నాయని తెలిపింది. ఓవరాల్‌ హైరింగ్‌ ఇండెక్స్‌ 2023 మేలో 265 నుంచి 2024 మేలో 295కి పెరిగింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 11% పెరిగింది. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్‌ రికవరీ అవుతుండటం శుభ పరిణామం. ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఎక్కడ సవాళ్లు ఎదురవుతున్నాయో చూద్దాం. పరిశ్రమల వారీగా నియామకాల వృద్ధి ప్రొడక్షన్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ రంగంలో ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ (YoY) హైరింగ్‌లో 47% వృద్ధి నమోదైంది. పెద్ద ఎత్తున తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దిగుమతులు, ఎగుమతులను ప్రభావితం చేసే విధానాలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో ఈ గ్రోత్ సాధ్యమైంది. హోమ్‌ అప్లియన్సెస్‌, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్‌ ఇండస్ట్రీలో హైరింగ్ 35% పెరిగింది. అదే టెలికాం/ISP రంగంలో, టెలికమ్యూనికేషన్ సర్వీసుల్లో అధిక పెట్టుబడులు, సడలించిన ఎఫ్‌డీఐ నిబంధనలు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌(IoT), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్‌లు, 5G టెక్నాలజీ రాకతో నియామకాలు పెరిగాయి. హైరింగ్‌లో ఈ రంగం 9% వృద్ధిని నమోదు చేసింది. హెల్త్‌ కేర్‌ ఇండస్ట్రీ ఇయన్‌ ఆన్‌ ఇయర్‌ హైరింగ్‌లో ఏకంగా 29%, నెల వారీగా 4% పెరుగుదల ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. మధ్యస్థ వృద్ధి రంగాలు యాన్యువల్‌ గ్రోత్‌ రేటులో రిటైల్ 18%, చమురు / గ్యాస్/పెట్రోలియం 22% వృద్ధిని నమోదు చేశాయి. కీలక రియల్ ఎస్టేట్ రంగం 20%, ఐటీ 20% నియామకాల వృద్ధిని పొందాయి. నియామకాలు తగ్గిన రంగాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు -16%, షిప్పింగ్/మెరైన్ -30, FMCG రంగంలో -9% నియామకాలు తగ్గాయి. ఇంపోర్ట్స్‌/ఎక్స్‌పోర్ట్స్‌లో కూడా -16% హైరింగ్‌ తగ్గింది. టైర్-2 నగరాలు వర్సెస్ మెట్రోలు టైర్-2 నగరాలు హైరింగ్ యాక్టివిటీలో మెట్రోలను అధిగమించాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీ వ్యాపారాలను కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్ వంటి నగరాలకు విస్తరించడానికి తోడ్పడ్డాయి. ఈ నగరాలు ఉన్నతమైన లాజిస్టిక్స్, మార్కెట్ యాక్సెసిబిలిటీ, మెరుగైన జీవన నాణ్యతను అందిస్తాయి. అట్రాక్టివ్‌ హైరింగ్‌ లొకేషన్స్‌గా చేస్తాయి. టైర్-2 నగరాల్లో ప్రొడక్షన్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌ రంగంలో 29% హైరింగ్‌ నమోదైంది. తర్వాత స్థానాల్లో ఐటీ సాఫ్ట్‌వేర్ & సర్వీసెస్‌ 17%, స్థిరాస్తి 8%, విద్య 8%తో ఉన్నాయి. టైర్-2 నగరాలల్లో ఉద్యోగుల కనీస వేతనం రూ.4.01 LPA నుంచి రూ.5.43 LPA వరకు ఉంటుందని చెప్పింది. గరిష్ట జీతం రూ.7.12 LPA నుంచి రూ.11.01 LPA పొందుతున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. కోల్‌కతా, ఢిల్లీ/NCR వంటి మెట్రో నగరాలు హైరింగ్ హబ్స్‌లో అగ్రగామిగా ఉన్నాయి. IT సర్వీసెస్‌, డిజిటలైజేషన్ డిమాండ్‌ను చూపుతున్నాయి. మునుపటి లేఆఫ్స్‌ నుంచి రికవరీని సూచిస్తున్నాయి. మెట్రో నగరాల్లో కనీస వేతనం రూ.4.83 LPA నుంచి రూ.6.63 LPAగా తెలిపింది. గరిష్ట జీతం రూ.8.09 LPA నుంచి రూ.15.98 LPAగా పేర్కొంది. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.