TELUGU

NTR - Prashanth Neel: తారక్ బర్త్ డే బ్లాస్ట్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీపై బిగ్ అప్‌డేట్..

NTR - Prashanth Neel : దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2' కారణంగా ఎంతో లేట్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమాకు 'డ్రాగన్' అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషలకు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ పేరును ఫిక్స్ చేసినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. తారక్ విషయానికొస్తే.. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ఈ సినిమా తర్వాత జూనియర్ చేయబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్..కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. Happy Birthday to the 'MAN OF MASSES' @tarak9999 ❤‍🔥 -Team #NTRNeel Shoot begins from August 2024. Brace yourself for a powerhouse project 🔥 #HappyBirthdayNTR #PrashanthNeel @NTRArtsOfficial pic.twitter.com/UcXsyzKVhd — Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2024 దేవర మొదటి పార్ట్ ఈ యేడాది అక్టోబర్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్ 2' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. నార్త్, సౌత్ కలయికలో వస్తోన్న భారీ మల్టీస్టారర్ మూవీపై దేశ వ్యాప్తంగా అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి. ఈ మూవీని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో తారక్ మరోసారి మూడు విభిన్న పాత్రలతో అలరించనున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 'దేవర' రెండో పార్ట్‌ను 2025 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అటు 'వార్ 2' మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అది వీలుకాకపోతే 2025 ఆగష్టు 15న విడుదలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా ఎన్టీఆర్.. ఎలాంటి ఈగోలకు పోకుండా తన తోటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు వస్తున్నాడు. దీంతో పాటు మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో పాటు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.