TELUGU

Bigg Boss Telugu season 8: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్న యువ హీరో.. ఎవరంటే..!

Abhinav Gomatam in Bigg Boss: ఆగస్టు- సెప్టెంబర్ నెలలు వచ్చాయి అంటే.. బుల్లితెర ప్రేక్షకులకు పండుగ వాతావరణం ప్రారంభమైనట్లే. ఎందుకంటే..ఈ నెలలలో బుల్లితెర ప్రేక్షకులను రోజు పలకరిస్తూ.. మంచి ఎంటర్టైన్మెంట్ అందించే రియాలిటీ షో బిగ్‌బాస్.. ప్రారంభం అవుతుంది. బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైన తరువాత.. సుమారు 106 రోజులపాటు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందుతుంది. ఇక హౌస్‌లో జరిగే రచ్చలు, పంచాయతీలు, గేమ్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఈ నేపథ్యంలో ఈ సెప్టెంబర్‌లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ సీజన్ కంటెస్టెంట్స్ గురించి రోజుకొక వార్త వింటూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ వచ్చిన బిగ్‌బాస్‌లో అంతా ఉల్టా పుల్టా.. అంటూ తెగ సందడి చేశారు. ఈసారి ఏకంగా ఎంటర్టైన్మెంట్ లిమిట్‌లెస్ అంటూ.. హామీ ఇచ్చేస్తున్నారు. దీంతో రాబోయే సీజన్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఎంతో జాగ్రత్తగా సెలక్షన్ జరుగుతోందని టాక్. సీజన్ 7 తరహాలోని రాబోయే సీజన్ 8 లో కూడా భారీ సర్ప్రైజ్‌ను ప్లాన్ చేస్తున్నారంట. సీజన్ 7 తో పోలిస్తే రాబోయే సీజన్‌ను మరింత పకడ్బందీగా.. ఎవరు ఊహించలేని ట్విస్టులతో మన ముందుకు తీసుకురాబోతున్నారు. కంటెస్టెంట్ సెలక్షన్ దగ్గర నుంచి హౌస్‌లో జరిగే టాస్కుల వరకు మునుపేన్నడు లేని విధంగా.. చాలా సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా అభినవ్ గోమఠం పేరు కూడా ఈ కంటెస్టెంట్స్ లిస్టులో చేరిపోయింది. టాలీవుడ్‌లో టాలెంట్‌తో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్టుల్లో అభినవ్ ఒకరు. కామెడీ తో పాటు సెటైరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్కు సాటి మరి ఎవరు ఉండరు. అందుకే మీమర్స్‌కు అభినవ్ ఒక లైబ్రరీ లాంటివాడు. ప్రస్తుతం అతను వేసిన డైలాగ్స్తో ఉన్న మీమ్స్ చాలా పాపులర్ అనడంలో డౌట్ లేదు. సేవ్ టైగర్స్.. వెబ్ సిరీస్‌తో అభినవ్ బాగా పాపులర్ అయ్యాడు. ఈ మధ్యనే మస్తు షేడ్స్ ఉన్నాయి రా.. సినిమాలో హీరోగా కూడా కనిపించాడు. దీంతో బిగ్‌బాస్ షోలో అభినవ్ ఎంట్రీ ఇస్తున్నాడు అన్న విషయం చాలా బజ్ క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా బిగ్‌బాస్ లవర్స్..అభినవ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఖుష్ అవుతున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నారు అని టాక్. సీరియల్ క్యాటగిరి దగ్గర నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ వరకు.. బుల్లితెర కమెడియన్స్ నుంచి వెండితెర ఆర్టిస్టుల వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి బిగ్‌బాస్ హౌస్‌లోకి కంట్రీన్స్‌గా రాబోతున్నారు. ఎప్పటిలాగే ఈ షోను నాగార్జున తన స్టైల్‌లో హోస్ట్ చేయబోతున్నారు. త్వరలో ప్రారంభం కాబోతున్న తమ ఫేవరెట్ షో అప్డేట్స్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. Also Read : Bad Cholesterol Level: ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే.. నెల రోజుల్లో కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది Also Read : Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఒక్క రోజులోనే రూ. 250 వరకూ పతనం..శనివారం ధరలు ఇవే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.