TELUGU

Polygraph Test: నేను రేప్‌ చేయలేదు.. నేను వెళ్లేవరకే చనిపోయింది: రేపిస్ట్‌ సంజయ్‌ రాయ్‌ సంచలనం

Kolkata Doctor Case: యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా వైద్యురాలి అత్యాచారం సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో సంజయ్‌ వింత వింతగా ప్రవర్తించాడు. తనకు ఏమీ తెలియదని కుండబద్దలు కొట్టాడు. అసలు తాను వెళ్లేవరకు డాక్టర్‌ చనిపోయి ఉందని చెప్పి సంచలనం రేపాడు. తనకే ఏమీ తెలియదని బుకాయించాడు. Also Read: Income Tax Notice: తండ్రీ కొడుకులు భార్యాభర్తల లావాదేవీలపై నోటీసులు వస్తాయా కలకత్తాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలోని సెమినార్‌ హాల్‌లో ఆగస్ట్‌ 9వ తేదీన 31 ఏళ్ల యువ డాక్టర్‌పై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. క్రూరమృగాల ధాటికి ఆమె శరీరంలోని అన్ని అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా పర్సనల్‌ పార్ట్స్‌ వద్ద మరి దారుణంగా ఉండడంతో వాటిని తాళలేక చనిపోయింది. ఈ సంఘటన యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్యమం కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. Aslo Read: Payel Mukherjee: కలకత్తాలో మరో దారుణం.. జులాయిల వేధింపులతో గుక్కపెట్టి ఏడ్చిన స్టార్‌ హీరోయిన్‌ ఈ విచారణలో భాగంగా ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌, కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌తోపాటు మరో నలుగురికి పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 15 మందిని సీబీఐ అధికారులు విచారించారు. అయితే పాలిగ్రాఫ్‌ పరీక్షలో నిందితుడు సంజయ్‌ రాయ్‌ వ్యవహార శైలి అనుమానాస్పదంగా వ్యవహరించాడు. ఘటనకు పూర్తి విరుద్ధంగా సంజయ్‌ రాయ్‌ సమాధానాలు ఇచ్చాడు. 'నేను అక్కడకు వెళ్లేసరికి డాక్టర్‌ చనిపోయింది. సెమినార్‌ హాల్‌లో మృతదేహం కనిపించింది. దీంతో భయపడి పారిపోయా' అని సంజయ్‌ రాయ్‌ చెప్పినట్లు సమాచారం. డాక్టర్‌పై ఘోరం జరిగిన సమయంలో తాను అక్కడ లేనని.. వేరే చోట ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఏం తెలియదనట్టు.. తాను నేరం చేయనట్టు సంజయ్‌ రాయ్‌ సమాధానాలు ఉన్నాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆ సెమినార్‌ హాల్‌లో తాను ఎవరినీ చూడలేదని బుకాయించినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ అధికారులు 'మరి బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ ఎక్కడివి' అంటే సంజయ్‌ సమాధానం చెప్పలేకపోయాడు. తన శరీరంపై ఉన్న గాయాలపై కూడా సంజయ్‌ సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు. ఇక నీలి చిత్రాలు చూడడంపై అధికారులు అతడిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే విచారణలో సంజయ్‌ చెప్పిన సమాధానాలను సీబీఐ గోప్యంగా ఉంచింది. ఆ సమాచారం బయటకు రాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంది. కాగా పాలిగ్రాఫ్‌ పరీక్షను సీసీ కెమెరా పర్యవేక్షణలో పకడ్బందీ పోలీస్‌ బందోబస్తులో సీబీఐ అధికారులు నిర్వహించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.