TELUGU

Darshan case: దర్శన్‌కి జైల్లో రాజభోగాలు.. నెట్‌లో ఫొటోలు లీక్.. దెబ్బకు పోలీసులు సస్పెండ్..!

Darshan photo in jail: తాజాగా హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈయనను కలవడానికి వెళ్ళిన కొంతమంది అక్కడి నుండి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు కాస్త.. బయటకు రావడంతో ఇది చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు. ఒక చేతిలో దర్శన్ సిగరెట్ , మరో చేతిలో కాఫీ కప్పు హాయిగా కుర్చీలో కూర్చొని విహారయాత్రలకు వెళ్లినట్లు మరో ముగ్గురితో కబుర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈయన జైల్లో ఉన్నాడు. 2024 జూన్ 8న అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఈ స్టార్ హీరో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. జైలు జీవితం అంటే, కఠిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇంకొకసారి జైలుకు వెళ్ళకూడదు.. తప్పు చేయకూడదు అనే ఆలోచన రావాలి అని, పోలీసులు పగడ్బందీగా చర్యలు తీసుకుంటారు.కానీ ఇక్కడ మాత్రం జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు దర్శన్. గతంలో రాజభోగాల అనుభవిస్తున్నాడు అంటూ వార్తలు రాగా.. ఇందుకు తాజాగా ఫోటోలు నిదర్శనం అంటూ ప్రస్తుతం కనిపిస్తున్న ఫోటోలపై సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ఇతడు జైలు జీవితం గడుపుతున్నాడా లేక పిక్నిక్ కి వెళ్ళాడా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. దీనికి తోడు ఈ ఫోటోని అదే జైలులో ఉన్న ఒక ఖైదీ తన భార్యకు పంపాడు అని , అది సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్ గా మారినట్లు తెలుస్తోంది. జైలు అధికారులపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఖైదీలకు సెల్ ఫోన్లతో పని ఏంటి అని కొంతమంది కామెంట్లు చేస్తే.. మరి కొంత మంది.. ఇక్కడ ఖైదీలకు రాజబోగాలు లభిస్తాయి.. అందుకే వీరు ఎంచక్కా నేరాలు చేసి అక్కడికి వెళ్లి కూర్చుంటున్నాడు.. అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఫోటో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ కావడంతో.. దీనిపై పోలీసులు అక్కడి వెళ్లి విచారించారు అని కర్ణాటక హోమ్ మినిస్టర్ తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత.. ఏకంగా ఏడుగురు అధికారుల ప్రమేయం ఉందని వారు గుర్తించి.. వారిని సస్పెండ్ కూడా చేశామని తెలిపారు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వరన్. ఇకపోతే ఈ విషయంపై రేణుక స్వామి తండ్రి కాశీనాథ శివన గౌడర కూడా స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు కోర్టు అందుకు అనుమతించలేదు. దాంతో న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఏర్పడింది. అయితే ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు ..నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతున్నాను’ అంటూ ఆయన తెలిపారు. అంతేకాదు సిబిఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేశారు. Also Read: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే.. Also Read: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.