TELUGU

Hydra Demolition Status Report: హైడ్రా కూల్చివేతల పర్వం ఇదే, 43 ఎకరాలు స్వాధీనం

Hydra Demolition Status Report: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మోనిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. నిన్నటి వరకూ ఎవరికీ తెలియని పేరే. టాలీవుడ్ అగ్ర నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. హైడ్రా అంటేనే ఉలిక్కిపడే పరిస్థితి కన్పిస్తోంది హైదరాబాద్ నగరంలో. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం అదే కూల్చివేత ధోరణి కొనసాగిస్తోంది హైడ్రా. ఆక్రమించింది ఎవరైనా సరే కూల్చివేత తప్పదంటోంది. ఆక్రమణలు గుర్తించడమే ఆలస్యం వెంటవెంటనే కూల్చేస్తోంది. ఆక్రమణదారుడికి టైమ్ ఇవ్వకుండా కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా రిపోర్ట్ కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు 18 ప్రదేశాల్లో ఆక్రమణలు కూల్చి..43 ఎకరాల్లో స్ట్రక్చర్ తొలగించినట్టు హైడ్రా తెలిపింది. తుమ్మిడికుంటలోని 4.9 ఎకరాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సహా గండిపేట చెరువులో 15 ఎకరాల్లోని ఆక్రమణలు తొలగించినట్టు హైడ్రా పేర్కొంది. కూల్చివేత ద్వారా ఆక్రమణకు గురైన 43.94 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని హైడ్రా ప్రభుత్వానికి వివరించింది. ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనం, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి, బహదూర్ పురా ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మొహమ్మద్ మీర్జా, నందగిరి హిల్స్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు, బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాలను తొలగించినట్టు హైడ్రా నివేదికలో ఉంది. హైడ్రా కూల్చివేత లపై ఎవరి స్పందన ఎలా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువుల్ని రక్షిస్తామంటున్నారు. చెరువుల్లో పాం హౌస్‌లు నిర్మించుకున్నారని, ఆ డ్రైనేజీలను గండిపేట చెరువులో కలిపి కలుషితం చేస్తున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Also read: Srivari Seva Tickets: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ శ్రీవారి సేవా టికెట్లు రేపు విడుదల, దర్శనం-వసతి ఫ్రీ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.