TELUGU

Nagarjuna Vs Revanth: నాగార్జునను టార్గెట్ చేయడం వెనక రేవంత్ వ్యూహం అదేనా.. !

Nagarjuna Vs Revanth: నాగార్జున అక్కినేనికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేత ఘటనపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికే హైడ్రాతో హై డ్రామా చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదే దూకుడును రేవంత్ రెడ్డి చివరి వరకు కంటిన్యూ చేస్తాడా అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చెరువులు, కుంటల్లో అక్రమంగా నిర్మించిన అక్రమ కట్టడాలు మా పార్టికి సంబంధించిన వారివి ఉన్నా.. ఒదిలే ప్రసక్తే లేదంటున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ సమీపంలో తమ్మిడి కుంట సమీపంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై మీడియా అటెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. నాగార్జునను టార్గెట్ చేసి తాను అనుకున్న లక్ష్యాలను సాధించాడా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ పక్షాలు. ముఖ్యంగా తమకు అనుకూలంగా లేని పొలిటికల్ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికే ఈ కూల్చివేతలను సీఎం రేవంత్ రెడ్డి చేపట్టినట్టు రాజకీయ ప్రత్యర్దులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన రైతు ఋణ మాఫీ పూర్తి స్థాయిలో కాకుండా పరిమితంగా చేసారు. అంతేకాదు ఆడవాళ్లకు నెలకు రూ. 2500 పథకం పై ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. మరోవైపు చాలా మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా సరిగ్గా అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు సామాన్యులకు ఇస్తామన్నా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నుంచి దృష్టి మరలించడానికే రేవంత్ రెడ్డి ఇదంత చేసాడా అంటే ఔననే అంటున్నారు ఆయన పొలిటికల్ ప్రత్యర్థులు. మరోవైపు ప్రభుత్వ తప్పిదాల నుంచి దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి ఇదంత చేసాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు నాగార్జునను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మన నగరంలో మాసాబ్ ట్యాంక్ సహా పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. పైగా ప్రభుత్వం నిర్మించిన పలు భవనాలు కూడా ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి కూల్చివేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా లేదా చూడాలి. హైడ్రా కూల్చివేతలపై స్పందించారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా తనదైన శైలిలో స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కట్టారు. ప్రభుత్వ భవనాలను కూడా కూల్చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నెక్లెస్‌రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందన్నారు అసద్. అదే విధంగా నెక్లెస్‌రోడ్‌ను కూడా తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని.. మరి జీహెచ్‌ఎంసీ కార్యాలయం పరిస్థితేంటి అని అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో చెరువులు, కుంటలు ఆక్రమించి ఎన్నో కట్టడాలు నిర్మించారు. మరి వాటన్నిటినీ తొలిగించుకుంటూ పోతే నగరంలో ఏది మిగిలే అవకాశాలే లేవని ప్రత్యర్థులు అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ తప్పిదాల నుంచి దృష్టి మరల్చడానికే ఈ పనిచేసినట్టు ఆరోఫణలు చేస్తున్నారు. ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే.. ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.