TELUGU

Peka Medalu Movie Review: ‘పేక మేడలు’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే లో క్లాస్ మెలోడీస్..

నటీనటులు : వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు. ఎడిటింగ్ : సృజన అడుసుమిల్లి, హంజా అలీ సినిమాటోగ్రఫీ : హరిచరణ్ కె. సంగీతం : స్మరణ్ సాయి నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నిర్మాత : రాకేష్ వర్రే దర్శకత్వం : నీలగిరి మామిళ్ల వినోద్ కిషన్.. హీరోగా, అనూష కృష్ణ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పేక మేడలు’. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ‘పేక మేడలు’ టైటిల్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ రోజు విడుదలైన ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. కథ విషయానికొస్తే.. హైదరాబాద్ లో ఓ చిన్న బస్తీలో ఉండే లక్ష్మణ్ (వినోద్ కిషన్). ఇంజినీరింగ్ చదివినా.. ఉద్యోగం చేయడంపై పెద్దగా ఆసక్తి చూపించడు. రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తూ రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలని గాల్లో పేక మేడలు కట్టే బాపతు. అతనికో భార్య వరలక్ష్మి (అనూష కృష్ణ) భర్త సంపాదించకపోయినా.. ఇంట్లో మురుకులు, ఇతర తిండి పద్దార్ధాలు తయారు విక్రయిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇతర ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని గుట్టుగా లాక్కుంటూ వస్తుంది. ఈ క్రమంలో వరలక్ష్మి కర్రీ పాయింట్ పెట్టుకోవాలనుకుంటుంది. అందుకు రూ.50 వేలు దాకా ఖర్చు అవుతాయి. ఈ క్రమంలో లక్ష్మణ్ స్నేహితుడి దగ్గర రూ. 50 వేలు అప్పు చేస్తాడు. కానీ దాన్ని తన స్వంత అవసరాలకు వాడుకుంటాడు. ఈ క్రమంలో అమెరికా నుంచి పెళ్లై ఓ భర్త ఉన్న ఎన్నారై తో రియల్ ఎస్టేట్ కు సంబంధించిన పార్టనర్ అంటూ ఆమెను ట్రాప్ లో పడేస్తాడు. ఈ క్రమంలో అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. చివరకు పేక మేడల కట్టుకున్న అతని కలలు నిజమయ్యాయా ? లేదా అనేదే పేక మేడలు స్టోరీ. కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. ‘పేక మేడలు’ సినిమా టైటిల్ తోనే ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు చిత్ర దర్శక, నిర్మాతలు. పేక మేడలు ఎలా కుదురుగా ఉండవో.. దాన్ని నమ్ముకున్న వాళ్ల జీవితం కూడా అలాగే ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ముఖ్యంగా హైదరాబాద్ బస్తీలో ఉండే చాలా మంది నిరుపేదల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు యథాతధంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా బీదవాళ్ల బస్తీల్లో ఉండే ఇరుగు పొరుగుతో ఉండే అనుబంధం. మరోవైపు పేదల బస్తీల్లో ఉండే పిల్లలు ఎలా చెడిపోతారనేది తెరపై చక్కగా చూపించాడు. ముఖ్యంగా పేద మధ్య తరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూనే కామెడీ పండించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అందులో ఒకింత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమా చూస్తుంటే.. గతంలో ఇలాంటి తరహా చిత్రాలు కొన్ని గుర్తుకు వస్తాయి. అమ్మో ఒకటో తారీఖు, సరదా సరదాగా, శ్రీరామచంద్రులు వంటి సినిమాలు జ్ఞాప్తకానికి వస్తాయి. ముఖ్యంగా ఎన్నారైతో అతని ఎఫైర్. ఆమె ఎఫైర్ తెలుసుకున్న భర్త.. ఎలా లక్ష్మణ్ కు గుణపాఠం చెప్పే విషయం కూడా ఆకట్టుకుంటుంది. జీవితంలో కష్టపడండే ఏది సాధ్యం కాదనే విషయాన్ని ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేసాడు. విజయానికి ఎలాంటి షార్ట్ కట్ ఉండదనే విషయాన్ని తన సినిమాలో చూపించే ప్రయత్నం చేసాడు.అంతేకాదు ఈ సినిమాలో మహిళా సాధికారికతను చూపించే ప్రయత్నం మెచ్చుకోదగ్గ అంశం. పేకమేడలుతో పైకి రావాలనుకునే వారు జీవితాంతం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఎక్కడ వారి జీవితం మొదలవుతుందో.. అక్కడ ఉండిపోతారన్న విషయాన్ని ఈ సినిమాలో స్పష్టం చేశారు. ముఖ్యంగా బద్దకస్తులకు ఈ సినిమా ఓ పాఠం అని చెప్పాలి. మరోవైపు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా..నిర్మాత రాకేష్ వర్రే నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాన్ని నమ్మడమే కాకుండా.. దాన్ని తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ సెలక్షన్ విషయంలో నిర్మాత టేస్ట్ ఏంటో అర్థమవుతుంది. గతంలో నిర్మాతగా సక్సెస్ అందుకున్న రాకేష్ వర్రె.. తాజాగా ‘పేక మేడలు’ చిత్రంతో మంచి విజయం సాధిస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పదును పెడితే బాగుండేది. సినిమాటోగ్రపీ, ఆర్ఆర్ బాగున్నాయి. నటీనటుల విషయానికొస్తే.. వినోద్ కిషన్ గతంలో 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. తాజాగా ‘పేక మేడలు’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అతని పాత్ర మాత్రమే కనపడింది. మరోవైపు పేద మధ్యతరగతి గృహిణి వరలక్ష్మి పాత్రలో నటించిన అనూష కృష్ణ తన పాత్రలో జీవించింది. ఎన్నారైగా నటించిన నటితో పాటు.. హీరో ఫ్రెండ్ షేర్ శివ ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్లస్ పాయింట్స్ కథనం నటీనటుల నటన నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ ఎడిటింగ్ అక్కడక్కడ ల్యాగ్ సీన్స్ రేటింగ్: 3/5 ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా.. ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.