TELUGU

Virgin Flight Naked: బట్టలు విప్పేసి నగ్నంగా విమానంలో వ్యక్తి హల్‌చల్‌.. దెబ్బకు విమానం వెనక్కి

Virgin Flight Naked: విమానంలోకి ఎక్కిన ప్రయాణికుడు అకస్మాత్తుగా బట్టలు విప్పేశాడు. ఒంటిపై ఒక్క బట్ట కూడా లేకుండా విప్పేసి ఒక్కసారిగా విమానంలో పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అతడి వికృత చేష్టలు చూడలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే అడ్డగించేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందిపై దాడి చేశాడు. అంతటితో ఊరుకోకుండా ఎగ్జిట్‌ డోర్‌ తెరచే ప్రయత్నం చేశాడు. తీవ్ర గందరగోళం ఏర్పడడంతో వెంటనే పైలెట్లు విమానం వెనక్కి తిప్పారు. అనంతరం అతడిని పోలీసులకు పట్టించారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. Also Read: Last Rites: డబ్బుల్లేక ప్రియురాలు మృతదేహాన్ని రోడ్డున పడేశాడు.. పదేళ్లు డేటింగ్‌ తర్వాత దారుణం ఆస్ట్రేలియాలోని పెర్త్‌ నుంచి మెల్‌బోర్న్‌కు వీఏ696 విమానం ఈనెల 26వ తేదీ రాత్రి బయల్దేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ తీసుకున్న కాసేపటికే ఓ ప్రయాణికుడు లేచాడు. లేచి వెంటనే తన ఒంటిపై బట్టలన్నీ విప్పేశాడు. ఒక్క నూలు పోగు కూడా లేదు. అనంతరం నగ్నంగా విమానంలో పరుగులు తీశాడు. అటు ఇటు తిరుగుతూ హల్‌చల్‌ చేశాడు. విస్తుపోయిన ప్రయాణికులు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అతడి చేష్టలను సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసింది. అడ్డుకున్న సిబ్బందిపై అతడు దాడికి పాల్పడ్డాడు. Also Read: PM Modi Hotel Bill: సద్దుమణిగిన ప్రధాని మోదీ హోటల్‌ అద్దె గొడవ.. రూ.80 లక్షలు చెల్లించేదెవరో తెలుసా? అంతేకాకుండా విమాన సిబ్బందిని కింద పడేశాడు. దారుణంగా వ్యవహరించడంతో సిబ్బంది గాయపడ్డారు. ఎంతకీ అతడు వినకపోవడంతో వెంటనే పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. పెర్త్‌ విమానాశ్రయంలో అతడిని పోలీసులకు పట్టించారు. అనంతరం యథావిధిగా విమానం మెల్‌బోర్న్‌కు బయల్దేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా నాలుగైదు గంటలు ఆలస్యంగా విమానం బయల్దేరింది. అయితే అతడు నగ్నంగా వికృత చేష్టలకు పాల్పడడం వెనుక కారణాలు తెలియలేదు. అతడి మానసిక పరిస్థితి బాగా లేదా అని పోలీసులు వైద్య సహాయం పొందారు. ఈ ఘటన విమానయాన సంస్థ స్పందించింది. 'ఈ ఘటనతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు' అని వర్జిన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.