TELUGU

Saripodhaa Sanivaaram:‘సరిపోదా శనివారం’ మీ అంచనాలను మించి ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు..

Saripodhaa Sanivaaram : నాచురల్ స్టార్ నాని.. లాస్ట్ ఇయర్ ‘దసరా’ వంటి ఊర మాస్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆ వెంటనే పూర్తి మేకోవర్ తో ‘హాయ్ నాన్న’ వంటి క్లాస్ చిత్రంతో పలకరించారు. ఈ రెండు చిత్రాలతో ఆడియన్స్ ను మెప్పించాడు. ఇపుడు మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో కోపాన్ని అణుచుకునే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. కేవలం వారంలో శనివారం మాత్రమే తన కోపాన్ని బట్టబయలు చేస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగిందేనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. తాజాగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సందర్బంగా ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రేక్షకులను సరికొత్త అనుభూతి ఇస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య, దాసరి కళ్యాణ్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేశాడు. ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల అవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా పలు ప్రాంతాల్లో చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నెల 29న సినిమా విడుదల కాబోతుంది. అందులో భాగంగా శనివారం నాడు రాత్రి 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సరిమప.. ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదలైంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో దేవకట్టా, శ్రీకాంత్, సుధాకర్ చెరుకూరి, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ, ఎస్.జె. సూర్య, ప్రియాంక అరుణ్ మోహన్, కెమెరామెన్ మురళీ, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తదితరులు పాల్గొని సందడి చేసారు. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. . ‘సరిపోదా శనివారం’ సినిమా చూసి వచ్చిన తర్వాత అది మీ మనసుపై బలమైన ముద్ర వేస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. ట్రైలర్ లో చిన్నగా అరిశాను. ఈనెల 29న అందరూ అంతరేంజ్ లో సక్సెస్ ఇవ్వాలి. వివేక్ ఏమి తీశాడో 29న ప్రేక్షక దేవుళ్లకు తెలుస్తుంది. వివేక్ శివతాండవం ఈ సినిమాలో చూపించాడు. ఇది వివేక్ కు మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. మా కష్టాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. జేక్స్ నా ఫ్యాన్. టెన్షన్ వున్నప్పుడు జేక్స్ ఆర్.ఆర్. ఇంటే రిలీఫ్ గా వుంది. సినిమాటో గ్రాఫర్ మురళీ గారు చాలా కేర్ తీసుకుని టేక్ ఎన్ని అయినా కాంప్రమైజ్ కాలేదు. ఇక ఎడిటింగ్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమాలో సోకుల పాలెం సెట్ అనేది రియల్ లొకేషన్ లా ఆర్ట్ డైరెక్టర్ చేశాడు. మా నిర్మాత దానయ్యగారు ఏ సినిమాకూ కథ తెలీయదు. లొకేషన్ కు వచ్చి అన్నీ మీరే చూసుకోండని అంటారు. కానీ ఆయనకు అద్రుష్టం వుంది. అందుకే సరిపోదా శనివారం, ఓజీ లాంటి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. వివేక్ తో పనిచేయాలంటే టీమ్ చాలా కష్టపడాలి. ఈ సినిమా సక్సెస్ లో అందరికి భాగం వుందన్నారు. సాయికుమార్ నాకు తండ్రిగా నటించారు.. కానీ బాబాయ్ లా అనిపిస్తారు. ఆయనతో నటించడం పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి. అభిరామి, అతిది తదితరులు చక్కగా నటించారు. అలీ ఇందులో భాగం అయ్యారు. ప్రియాంక ను ఆఫ్ స్క్రీన్ లో ప్రేమలో పడతారు. ఈ సినిమా లో సూర్య, చారు పాత్రలను దర్శకుడు వివేక్ చక్కగా డీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అవుతారు. ఇక ఎస్.జె. సూర్య చేసిన దయా పాత్రకు ఆయనే సరియైన నటుడు. ఆగస్టు 29న పోతారు. అందరూ పోతారు. అందరూ థియేటర్ కు పోతారు. 29న సరిపోదా శనివారం చూస్తారు. చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ, మా కుటుంబం అంతా ఈ వేడుకకు వచ్చి ఆశీస్సులు అందించారు. శ్రీకాంత్, ప్రశాంత్,శౌర్యవ్ తదితరులు వచ్చినందుకు థ్యాంక్స్. చిత్ర నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ, సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ అవుతుంది. నాని కథల ఎంపికలో మంచి టేస్ట్ ఉన్న కథానాయకుడు. కథ నచ్చితే కొత్త దర్శకుడయినా అవకాశం ఇస్తారు. నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ వుండదు. అన్నీ ఆయనే చూసుకుంటారని అన్నారు. కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ, నాకు ఇది స్పెషల్ ఫిలిం. దానయ్యగారు నాకు ఓజి. సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చారు. నా కెరీర్ లో ఈ రెండూ సినిమాలు చాలా డిఫరెంట్. అందుకు కళ్యాణ్, దానయ్యగారికి థ్యాంక్స్. వివేక్ గారు మంచి పాత్ర ఇచ్చారు. నటుడు అలీ మాట్లాడుతూ, దేశముదురు ,జులాయి, గంగతో రాంబాబు వంటి ఎన్నో సినిమాలు తీసిన దానయ్యతో ఆర్.ఆర్.ఆర్. వంటి సినిమాను తీసి హాలీవుడ్ లో మన ఖ్యాతిని చాటారంటే రాజమౌళి కారణం. రాఘవేంద్రగారి దగ్గర నాని అసిస్టెంట్ గా పనిచేసి తనలోని నటుడిని వెలికితీసి సక్సెస్ సాధించారు. ఈ సినిమాలో నానితో నటించాను. చైల్డ్ ఆర్టిస్టుగా కూడా నాని సినిమాలో చేశానన్నారు. ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే.. ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.