TELUGU

Viral Video: కొంప ముంచిన వెదురు కర్ర.. కరెంట్ షాక్ తో వ్యక్తి స్పాట్ డెడ్..షాకింగ్ వీడియో వైరల్..

Uttar Pradesh man dies after accidentally touching powerline: ఉత్తర్ ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న దేవెంద్ర అనే వ్యక్తి తన బంధువు ఇంటికి పెళ్లి వేడుకల కోసం వచ్చాడు.అతను పందిరి వేయడానికి ఒక పొడవైన కర్రను తీసుకొని ఇంటిలోపలికి ప్రవేశిస్తున్నాడు. ఇంతలో అతగాడి చేతిలో ఉన్న కర్ర.. కరెంట్ వయర్ కు తాకి విద్యుత్ ప్రసారం జరిగింది. సెకన్ల వ్యవధిలో సదరు వ్యక్తి కరెంట్ షాక్ తో విగత జీవిగా మారిపోయాడు. వేడుకల్లో విషాదం.. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి ఉత్తరప్రదేశ్ - మహోబా జిల్లా జసొదా నగర్‌లో దేవేంద్ర(35) అనే వ్యక్తి తన సమీప బంధువు జరిపే వేడుకలకు వచ్చాడు.. వేడుకల్లో పని చేస్తూ ఒక పచ్చి వెదురు బొంగును పట్టుకు వెళ్తుండగా, అది కరెంట్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. pic.twitter.com/mx1rvKDM4P — Telugu Scribe (@TeluguScribe) July 4, 2024 ఆ కర్ర పచ్చిగా ఉండటం వల్ల.. దానిలో కరెంట్ సరఫరా జరిగింది.. వెంటనే అతను దూరంగా పడ్డాడు. అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. అతడికి సపర్యలు చేశారు. కానీ అతనిలో చలనం మాత్రం లేదు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దేవెంద్ర తన బంధువు సువేంద్ర సింగ్ ఇంట్లో జరుగుతున్న పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో, అతని కుటుంబ సభ్యులు ఆలయానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కొందరు ప్రసాదం తయారు చేస్తుండగా, మరికొందరు ఆలయంలో పూజలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా, దేవెంద్ర ఒక పోల్‌ కట్టడానికి ఒక బొంగు కర్ర తీసుకువచ్చాడు. Read more: Darshan wife: బాంబు పేల్చిన దర్శన్ భార్య.. పవిత్ర గౌడ కేసులో మరో షాకింగ్ పరిణామం.. కానీ, ఆ బొంగు తాజాగా కురిసిన వర్షం వల్ల తడిసింది. అది విద్యుత్ తీగను తాకింది. దీంతో అతను విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దేవెంద్ర బంధువులు తమ ఇంటి పై నుండి వెళుతున్న విద్యుత్ తీగ చాలా తక్కువ ఎత్తులో ఉందని, అది ప్రమాదకరంగా ఉందని గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కానీ, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్రకలకలంగా మారింది. ఈ ప్రమాదపు వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.