TELUGU

Sunny Leone QG: 'కొటేషన్ గ్యాంగ్‌'తో బాక్సాఫీసుపై సన్నిలియోన్ వార్‌.. తెలుగు వరల్డ్ వైడ్ రైట్స్ ఆ సంస్థకే..!

Sunny Leone Quotation Gang Movie: జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించిన మూవీ క్యూ జి.. వివేక్ కుమార్ దర్శకత్వం వహిస్తూ.. ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్‌పై నిర్మించగా.. గాయత్రి సురేష్ మరో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ మూవీపై భారీ అంచనాల నేపథ్యంలో తెలుగు రైట్స్‌ కోసం హై కాంపిటీషన్‌ ఉండగా.. తెలుగు వరల్డ్ వైడ్ విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత ఎం.వేణుగోపాల్ దక్కించుకున్నారు. రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ఆయన తెలుగు ప్రేక్షకులను అందించనున్నారు. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్‌ నటిస్తుండగా.. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌తో మరింత అంచనాలు పెరిగిపోయాయి. Also Read: Kolkata Doctor Case: ఆ దుర్మార్గుడికి శిక్ష ఎలా ఉండాలంటే.. కాక రేపుతున్న మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యలు.. తెలుగు రైట్స్ దక్కిన సందర్భంగా ప్రొడ్యూసర్ ఎం.వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం భారీగా కాంపిటీషన్ ఉందని.. అయినా తనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమిళ నిర్మాతలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోందని.. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా అదిరిపోయిందన్నారు. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన ఈ చిత్రానికి హైలెట్ అవుతాయని.. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమా.. పెద్ద సినిమా అని తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఈ సినిమాకు కూడా మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ==> యాక్టర్స్: జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా అర్జున్. టెక్నీషియన్స్ : ==> బ్యానర్ : రుషికేశ్వర్ ఫిలిమ్స్, ఫిల్మ్ నటి ప్రొడక్షన్స్, వై స్టూడియోస్ ==> పొడ్యూసర్స్ : ఎం. వేణుగోపాల్, వివేక్ కుమార్ కన్నన్, గాయత్రి సురేష్ ==> DOP: అరుణ్ బాత్మనబన్ ==> సంగీతం : డ్రమ్స్ శివమణి ==> ఎడిటర్ : కె.జె. వెంకటరమణన్ ==> డైరెక్టర్ : వివేక్ కుమార్ కన్నన్ ==> డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం ==> PRO : మధు VR Also Read: Nita Ambani: ముఖేష్ అంబానీ జీతం సున్నా..నీతా అంబానీ వారి పిల్లల జీతం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.