TELUGU

Allu Arjun: బన్నీ కోసం పెద్ద ప్లాన్స్ వేసిన స్టార్ డైరెక్టర్.. హైప్ మాత్రం వేరే లెవెల్!

Allu Arjun - Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 త్వరలో విడుదల కి సిద్ధమవుతుంది. సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న బన్నీ ప్రస్తుతం కుటుంబంతో ఫారిన్ ట్రిప్ లో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా నిర్మాత బన్నీ వాసు.. అల్లు అర్జున్, పుష్ప 2, ఇలా ఎన్నో అంశాల గురించి క్లారిటీ ఇచ్చారు. వివాదాల నుండి సినిమా అప్డేట్స్ దాకా చాలా విషయాలపై రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బన్నీ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం లో ఈ మూడు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు వీరి నాలుగవ సినిమా గురించి చెప్తూ, ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అని చెప్పారు. సినిమా గురించి చెప్తూ, "ఇది కథ కంటే కాన్సెప్ట్ అని చెప్పచ్చు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం కనీసం 18 నెలలు పడుతుంది." అని అన్నారు బన్నీ వాసు. త్రివిక్రమ్ ఎప్పటినుండో ఫ్యామిలీ స్టొరీ టెంప్లేట్ నుండి బయటకు రావడానికి కష్టపడుతున్నారు. ఇక ఈ పాన్-ఇండియా సినిమా కూడా విభిన్నమైన కథ రాశారా అని కొందరు చెబుతున్నారు. త్రివిక్రమ్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా రేంజ్ సినిమా తీయడం త్రివిక్రమ్ వల్ల అవుతుందా అని కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్, హైప్ చూస్తే మాత్రం త్రివిక్రమ్ భారీ ప్లాన్ వేశారని అర్థం అవుతుంది. వర్క్ అవుట్ అయితే మాత్రం వీళ్ళ కాంబో లో వచ్చే బిగ్ హిట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. Also Read : ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది.. Also Read : ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.