TELUGU

Revu Movie: ఆ మూవీ రివ్యూ నేనే రాస్తా.. ముందుండి నడిపిస్తా..: ప్రొడ్యూసర్ దిల్ రాజు

Revu Movie Trailer: రేవు సినిమాను తాను ముందుండి నడిపిస్తానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సినిమాను చూసి తాను రివ్యూ రాస్తానని చెప్పారు. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి కీలక పాత్రల్లో హరినాథ్ పులి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రేవు. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్స్‌పై డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించిగా.. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యహరించారు. ఆగస్టు 23న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. శుక్రవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. Also Read: Kolkata Doctor Case: ఆ దుర్మార్గుడికి శిక్ష ఎలా ఉండాలంటే.. కాక రేపుతున్న మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యలు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దిల్ రాజు మాట్లాడుతూ.. కొత్త వాళ్లు.. కొత్త వాళ్లతో ప్రయోగం చేస్తునే ఉన్నారని.. కానీ 99 శాతం ఫెయిల్యూర్ అవుతున్నారని అన్నారు. కేవలం వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ ఉంటుందన్నారు. మురళీ వంటి వారు కొత్త వాళ్లతో సినిమాను చేశారని.. కానీ ప్రభు, పర్వతనేని రాంబాబు వంటి వారు ఉండటం వల్లే తాము అంతా ఇక్కడి వరకు వచ్చామన్నారు. ఇలాంటి సినిమా తీయడం గొప్పకాదని.. ఆడియన్స్‌ను థియేటర్‌ వరకు తీసుకురావడం గొప్ప విషయం అన్నారు. రేవు మూవీ సినిమా కాన్సెప్ట్ బాగుందని.. తాను ముందుండి నడిపించాలని అనుకున్నానని అన్నారు. ఈ సినిమాను చూసి తాను రివ్యూ రాస్తానని అన్నారు. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. మురళీ తనకు ఎంతో కాలం నుంచి పరిచయం అని చెప్పారు. రేవు చిత్రాన్ని చూసి ఆయన కొన్నారని.. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. తక్కువ బడ్జెట్‌లో ఎంత అద్భుతంగా సినిమా తీయవచ్చో రేవు మూవీ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. సెన్సార్ వాళ్లు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారని చెప్పారు. నిర్మాత మురళీ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర ప్రేక్షకుడితోపాటు ఇంట్లోకి వెళుతుందన్నారు. ఈ సినిమాను చూసిన వారందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు. ఆగస్ట్ 23న థియేటర్‌లో చూసి మంచి విజయాన్ని అందించాలని కోరారు. నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం చిన్న చిత్రాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయని.. గత వారం కమిటీ కుర్రోళ్లు, ఈ వారం ఆయ్ మూవీ హిట్ అయిందన్నారు . వచ్చే వారం రేవు సినిమా కూడా ఆడుతుందన్నారు. పర్వతనేని రాంబాబు, ప్రభు చాలా క్వాలిటీ ఉన్న చిత్రాన్ని తీసుకున్నారని.. దిల్ రాజు, ఏసియన్ ద్వారా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. Also Read: Nita Ambani: ముఖేష్ అంబానీ జీతం సున్నా..నీతా అంబానీ వారి పిల్లల జీతం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.