TELUGU

Peka Medalu: రూ. 50లకే ‘పేక మేడలు’ మూవీ పెయిడ్ ప్రీమియర్స్.. జూలై 19న సినిమా విడుదల..

Peka Medalu Paid Premiers : ప్రస్తుతం మన థియేటర్స్ మరియు మల్టీప్టెక్స్ లో టికెట్ రేట్స్ సామాన్యులకు అందుబాటులో లేవనే చెప్పాలి. ఒక ఫ్యామిలీ కలిసి ఓ సినిమా చూడాలంటే దాదాపు జేబు తడుముకొని చూడాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ‘పేక మేడలు’ మూవీ యూనిట్ తమ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను కేవలం రూ. 50 లకే ప్రేక్షకులకు అందజేస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోగా చేసిన సినిమా 'ఎవరికీ చెప్పొద్దు' థియేటర్ మరియు ఓటిటి లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండవ సినిమాగా ‘పేక మేడలు’ మూవీ ఈ నెల 19న థియేట్రికల్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్నారు వినోద్ కిషన్ (Vinodh Kishan). గతంలో 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కామెడీ తో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఈ సినిమాను నిర్మించారు. జీవితంలో దేనికి షార్ట్ కట్ ఉండదు. కష్టపడందే ఏది దక్కడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇంతకుముందు వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే రూట్లో ప్రమోషన్ చేస్తూ పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ రేట్ రూ. 50 రూపాయలకే పెట్టి వైజాగ్, విజయవాడ మరియు హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో ప్రత్యేకంగా షోలు వేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఈ ప్రమోషన్స్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఈ నెల 19న ‘పేక మేడలు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ : ఈ సినిమా ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చాలా సపోర్ట్ చేశారు. సినిమాల్లో నటించిన నటీనటులందరూ సహకరించారు. ఆడియన్స్ కూడా మేము ఏ ప్రమోషన్స్ చేస్తున్నా ఆదరిస్తూ మంచి సపోర్ట్ గా నిలిచారు. ఈ నెల 19న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మా సినిమా కూడా అలాగే ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది.. నటీనటులు : వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: హరిచరణ్ కె.ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ, సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి,లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్,పి ఆర్ ఓ: మధు , నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్, నిర్మాత: రాకేష్ వర్రే,రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల. ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.