TELUGU

TCA: ఓ గొప్ప పని కోసం టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్.. సీజన్ 2 పోస్టర్ లాంచ్..

TCA : మెల్బోర్న్ లో ఉన్న ‘ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్’ చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ లాంఛ్ కార్యక్రమంలో ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ : టి సి ఏ 2006లో స్థాపించారు. ఇలా సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ద్వారా క్రికెట్ మ్యాచ్ ఆర్గనైజ్ చేసి వచ్చిన చారిటీ ద్వారా ఆర్దిక సహాయం అందిస్తున్న సాయి కృష్ణకి మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్లు జరుతున్నాయి. ఈ యేడాది ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే యేడాది రెండు సీజన్లు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 టాలీవుడ్ క్రికెట్ సెలబ్రిటీ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఆయనకు సినిమా అనుభవం కూడా ఉంది. ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. ఈ నవంబర్ 15, 16 జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరో తరుణ్ మాట్లాడుతూ : సాయి కృష్ణ ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ చారిటీ కోసం ఆర్గనైజ్ చేయడం చాలా మంచి విషయమన్నారు. ఇప్పటివరకు ఆడిన ఏ చారిటీ మ్యాచ్ కూడా మనం ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాము. ఈ సీజన్ కూడా తప్పకుండా గెలుస్తామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ : మాకు ఉన్న స్ట్రెస్ కి ఒక రిలీఫ్ గా ఫీల్ అయ్యేది క్రికెట్ మ్యాచ్ మాత్రమే. ఈవినింగ్ వర్క్ అయిపోయాక మేము అందరం కలుసుకునేది క్రికెట్ గ్రౌండ్ లోనే. ఈ యేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా వెళ్లి సీజన్ 1 ఆడి వచ్చాము. ఆస్ట్రేలియాలో మాకొచ్చిన రిసెప్షన్ చూసి ఆశ్చర్యం కలిగింది. సాయి ఇంత గ్రాండ్ గా ఒక చారిటీ కోసం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, ఓంకార్ వంటి హీరోలు TCA విషయమై మాట్లాడారు. సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఫౌండర్ సాయి కృష్ణ మాట్లాడుతూ : ఫిబ్రవరిలో సీజన్ 1ను గ్రాండ్ గా నిర్వహించాం. హీరో శ్రీకాంత్ హీరో తరుణ్ ముందు నుంచి ఎంతో సపోర్ట్ గా నిలిచారు. ఈ సెలబ్రిటీస్ అందరూ ఎంతో బిజీగా ఉన్నా చారిటీ కోసం వచ్చి క్రికెట్ ఆడి సపోర్ట్ చేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా.. ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.