TELUGU

Thangalaan Twitter Review: విక్రమ్ ఈజ్ బ్యాక్.. తంగలాన్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. బ్లాక్‌బస్టర్ కొట్టేసినట్లేనా..!

Thangalaan Movie Review and Rating: విక్రమ్.. ప్రతి సినిమాకి ఎంతో కష్టపడతారు అన్న విషయం మనకు తెలిసిందే. అలాంటి ఈ హీరో.. మరింత కష్టపడి తీసిన సినిమా ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి రంజిత్ దర్శకత్వం వహించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన.. షోలు ఇప్పటికే కొన్ని చోట్ల పడ్డాయి. మరి సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా గురించి ఏమి చెబుతున్నారో ఒకసారి చూద్దాం.. విక్రమ్ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఈ సినిమా చాలా బాగుంది అంటూ ఉండగా.. మరికొందరు మాత్రం.. చాలా బోర్ గా ఉంది అంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు విక్రమ్ నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ఎలాగున్న.. విక్రమ్ తన వంద శాతం ఇస్తారు అనడానికి.. ఈ సినిమా మరో ఉదాహరణ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఎంతోమంది.. విక్రమ్ కథల విషయంలో మరింత కేర్ తీసుకోవాలి అంటూ సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే విక్రమ్ నటన అద్భుతంగా ఉన్న.. కథల ఎంపికలో పొరపాటు జరగడం వల్ల.. గత కొద్దిరోజులుగా ఈ హీరోకి ఫ్లాపులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా కథ కూడా అంతగా బాగాలేదని.. సినిమా ఇంటర్వెల్ తరువాత నుంచి చాలా బోర్ గా ఉందని.. దర్శకత్వం పరంగా శ్రద్ధ తీసుకొని ఉంటే.. విక్రమ్ శ్రమ ఫలించేది అంటూ కామెంట్లు పెడుతున్నారు. #Thangalaan (Tamil|2024) - THEATRE. Passable 1st Hlf & Clueless 2nd Hlf. Chiyaan outstanding Perf. Parvathy scores. Malavika ok. BGM, Making gud. Little hard to follow d dialogues in 1st Hlf. Story doesnt move post interval; emotional connect is missing. Pa Ranjith DISAPPOINTS! pic.twitter.com/MBT31hp4sn — CK Review (@CKReview1) August 15, 2024 Read more: Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.