TELUGU

Big King Cobra Video: కింగ్‌ కోబ్రాకు చుక్కలు చూపించిన జీన్స్ ప్యాంట్ అమ్మాయి.. వీడియో చూస్తారా?

Big King Cobra Video Watch Here: అనుకోకుండా పాములు కనిపిస్తే వాటిని చూసిన వెంటనే 20 అడుగుల దూరం పరిగెత్తే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది అయితే పామును చూసిన వెంటనే కేకలు వేసి భయభ్రాంతులకు గురై పరిగెత్తే వారిని చూసుంటాం కానీ ఇటీవలే ఓ యువతి భారీ కొండచిలువను చూడడమే కాదు.. ఏకంగా దానిని ఒంటి చేతితో పట్టేందుకు ప్రయత్నించింది. మామూలుగా కాదు.. కింద పడుతూ లేస్తూ ఒంటిచేత్తోనే పట్టుకోవాలని చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి చాలామంది స్నేక్ క్యాచర్స్ ఎలాంటి పాములనైనా పట్టుకోవడానికి కొన్ని పరికరాలను వినియోగిస్తూ ఉంటారు. కానీ ఈ యువతి మాత్రం కేవలం చేతులతో పట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో.. ఆ అమ్మాయి చివరికి పామును పట్టుకుందో లేదో ఇప్పుడు తెలుసుకోండి. వీడియో వివరాల్లోకి వెళితే.. భారీ కింగ్‌ కోబ్రా బురదలోని పొలాల్లో సంచారం చేస్తూ ఉంటుంది. అయితే దీనిని గమనించిన ఓ జీన్స్ ధరించిన యువతి ఆ పామును చేప అనుకొని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే పామని తెలుసుకొని ఆమె వంగి పాము తోకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆ పాము మాత్రం బుసలు కొడుతూ పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఆ యువతి రెండుసార్లు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ ఆ పాము చిక్కకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి మరోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సమయంలో ఆ పాము ఆమె వైపుకు తిరిగి కాటేసే ప్రయత్నం చేస్తుంది. దీనిని ముందే గమనించిన ఆ యువతి పాము చేతుల నుంచి తప్పించుకుంటుంది. అయినప్పటికీ ఆ యువతి వదలకుండా మరోసారి ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆ పాము భయాందోళనకు గురై జరజర పాకుతూ పారిపోవడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.