TELUGU

Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు..

Vikalangula Hakkula Porata Samithi filed police complient against ias smita Sabharwal: తెలంగాణ కేడర్ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి. యూపీఎస్సీలో దివ్యాంగులకు రిజర్వేషన్ లు అవసరమా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై విద్యావేత్తలు, దివ్యాంగులు, అడ్వకేట్స్ లు, డాక్టర్ లు సైతం తప్పు పడుతున్నారు. ఒక ఉన్నత స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంఏంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. Read more: Puja Khedkar: మహానటి.. అంటూ నెటిజన్ల పంచ్ లు.. వైరల్ గా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మాక్ ఇంటర్వ్యూ.. ఇదిలా ఉండగా.. స్మితాసబర్వాల్ ఇటీవల మహరాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిణి పూజాఖేడ్కర్ ఘటన పై స్పందిస్తు.. యూపీఎస్సీలో రిజర్వేషన్ లు అవసరమా అంటూ వ్యాఖ్యలు చేశారు.దీంతో ఇది కాస్త వివాదానికి కేరాఫ్ గా మారింది. శరీరంలో అవయవ లోపం ఉన్న కూడా సమాజంలో ఎంతో మంది రాణిస్తున్నారని నెటిజన్లు స్మితాకు కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా.. ఉన్నత స్థానంలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా సెటైర్ లు వేశారు. దీనిపై వెంటనే భేషరతుగా వికంలాంగులకు స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాలని కూడా దేశంలోని దివ్యాంగులుంతా ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. Read more: Crocodile: ఇదేం పైత్యం.. 300 మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ తో స్టంట్.. చివరకు ఊహించని ట్విస్ట్... వీడియో వైరల్.. ఈ నేపథ్యంలో.. వికలాంగులను అగౌరపరిచిన స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య తో పాటు మరికొంతమంది వికలాంగులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పందంగా మారింది. దీనిపై రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు కలుగజేసుకుని స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. స్మితా భేషరతుగా దివ్యాంగ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని, లేకుండా నిరసనలు తెలియజేస్తామంటూ కూడా పలువురు దివ్యాంగులు హెచ్చరిస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.