TELUGU

Peka Medalu: పేక మేడలు సినిమా రికార్డ్.. ఈరోజు నుంచి యూఎస్ లో సైతం!

Peka Medalu Review: టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో.. పేక మేడలు అనే చిత్రం.. ప్రీమియర్లు కేవలం 50 రూపాయలే అంటు ప్రకటించడంతో.. ఈ సినిమాపై అందరి దృష్టిపడింది. అంతేకాకుండా ఈ చిత్ర ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాపై సినీ ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో వినోద్ కిషోర్ హీరోగా నటించగా.. అనుషా కృష్ణ హీరోయిన్ గా నటించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 19న విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రీమియర్స్ నుంచే మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రాన్ని.. తాజాగా జులై 26 నుంచి నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తరఫున యూఎస్ఏ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు నుంచి ఈ సినిమా యూఎస్ లో సైతం సంచదనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఒక సినిమా చూడాలంటే కనీసం 300 టికెట్ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. కానీ ఈ సినిమా నిర్మాతలు ఈ చిత్రానికి 100 రూపాయలకే టికెట్ రేట్లు పెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలాగా చేశారు. కలెక్షన్స్ కోసం కాకుండా మంచి సినిమాని.. ప్రేక్షకులు చూపించాలని.. ఈ చిత్రం టికెట్ రేట్లు చాలా తక్కువ ధరకే ఇచ్చారు. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న వచ్చిన ఈ చిత్రం ప్రతి మహిళా చూడాలనేది.. తమ ఉద్దేశం అంటూ నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే మాట్లాడుతూ : ‘విడుదలైన ఫస్ట్ షో నుంచే మా సినిమాని ఆదరించి.. ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు సిని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా టికెట్ రేట్ తక్కువ పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాని చూడగలిగారు. అందుకే ఇప్పుడు మా చిత్రాన్ని నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈనెల 26 నుంచి యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడి వాడు కూడా ఈ సినిమాని ఆదరిస్తారు అని ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో వినోద్ కిషన్ తో పాటు అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. Also Read: RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.