TELUGU

Rashmika Mandanna: రవితేజ సినిమాకి నో చెప్పిన హీరోయిన్.. ఎందుకో తెలుసా..!

Rashmika Mandanna Rejects Ravi Teja movie: ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటులలో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు. కెరీర్ ప్రారంభ దశలో.. చాలా చిన్న పాత్రలతో.. సినీ ఇండస్ట్రీలో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. అంచలంచలుగా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి.. మెల్లిగా హీరోగా మారాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేశ్వరి హీరోయిన్ గా..వచ్చిన ‘నీకోసం’ సినిమా తర్వాత రవితేజ‌కి హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో.. తెరకెక్కిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ అతన్ని సక్సెస్ ఫుల్ హీరోగా మార్చింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో.. స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు రవితేజ. ఎందరో హీరోలతో గతంలో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. సినిమాలు చేశాడు. హీరోగా మారిన తర్వాత కూడా చాలా సింపుల్‌గా ఉండే రవితేజ అంటే మిగిలిన నటులకు కూడా మంచి అభిప్రాయం ఉంది.ఇప్పటికి కూడా మంచి కంటెంట్.. ఉన్న సినిమాలు తీస్తూ.. కుర్ర హీరోలకి రవితేజ గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇంత పేరు తెచ్చుకున్న హీరో పక్కన హీరోయిన్గా చేయడానికి.. ఓ ముద్దుగుమ్మ నిరాకరించింది అంటే మీరు నమ్ముతారా? రవితేజ‌తో మూవీ చేసే అవకాశం వస్తే.. ఇష్టం లేక సినిమా నుంచి ఓ హీరోయిన్ తప్పుకుంది. అయితే ఆ ఆఫర్ అందిపుచ్చుకున్న హీరోయిన్ మాత్రం ఆ మూవీ సక్సెస్తో ఇండస్ట్రీలో.. మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ రావడానికి ముందు రవితేజ వరుస ఫ్లాపులు ఎదుర్కోవడమే ఇందుకు కారణం.. అని టాక్. త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ చేసిన ధమాకా మూవీలో.. హీరోయిన్ గా ముందు రష్మికను అనుకున్నారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే రష్మిక ఈ మూవీ నుంచి.. తప్పుకోవడంతో ఆ చాన్స్ శ్రీలీలకు వచ్చింది. ఈ మూవీ విడుదల సమయంలో రవితేజ, శ్రీలీల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్..గురించి కూడా ఎక్కువ విమర్శలు వచ్చాయి. కానీ సినిమా విడుదల అయ్యాక మాత్రం.. మంచి సక్సెస్ సాధించింది. నిజానికి రవితేజతో కలిసి నటించడం ఇష్టం లేక రష్మిక.. ఈ చిత్రం నుంచి తప్పుకుంది అన్న వార్త బాగా వైరల్ అయింది. అయితే బాలీవుడ్ లో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం వల్ల..రష్మిక ఈ సినిమాకి నో చెప్పింది అని తర్వాత క్లియర్ అయింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ధమాకా చిత్రం 100 కోట్ల కలెక్షన్ రాబట్టి భారీ విజయాన్ని అందించింది. రేపు ఆగస్టు 15న భారీ అంచనాల మధ్య.. మిస్టర్ బచ్చన్ మూవీతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. Read more: Ex CM YS Jagan: విమానంలో సామాన్యుడిలా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైరల్ గా మారిన ఫోటోలు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.