TELUGU

7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు..!

Karnataka Government Employees Salary Hike: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఆగస్టు 1 నుంచి 7వ వేతన సంఘం అమలులోకి రానున్నాయి. శాసనసభ సమావేశాల సందర్భంగా ఉద్యోగులకు వేతనాల పెంపును ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. Also Read: Loan Waiver: రేవంత్‌ రెడ్డి సంచలనం.. ఆగస్టు 15 కాదు.. జూలై 18వ తేదీనే రుణమాఫీ మాజీ ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్ రావు నేతృత్వంలోని 7వ వేతన సంఘం.. ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని 27.5 శాతం పెంచాలని సూచించింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏడాది రూ.17,440.15 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. జీతాల పెంపును ఆమోదించాలని రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆగస్టులో నిరవధిక సమ్మెను ప్రారంభించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సుల అమలుకు నిర్ణయం తీసుకుంది. 2023 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉద్యోగులకు మధ్యంతర 17 శాతం జీతాల పెంపును ఇచ్చారు. దీనికి ప్రస్తుత ప్రభుత్వం 10.5 శాతం పాయింట్ల పెంపును జత చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో మొత్తం 27.5 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే.. ఏడవ వేతన సంఘం సిఫార్సులు అమలు తమ మ్యానిఫెస్టోలో కూడా ఉందని.. దీనిని కేబినెట్‌లోకి తీసుకువచ్చామన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయాలని ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ సిఫార్సులు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి.." అని ఆయన ట్వీట్ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మార్చిలో 4 శాతం డీఏను పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. త్వరలో రెండో డీఏ పెంపు ఉండనుంది. మరోసారి 4 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. జూలై 1వ తేదీ నుంచి జీతాల పెంపు ఉండనుంది. Also Read: Reliance Shares: కోడలు రాధిక అడుగుపెట్టిన వేళ.. అంబానీ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తట్టింది స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.