TELUGU

Pushpa 2 Vs Game Changer: ముదరనున్న రామ్ చరణ్-అల్లు అర్జున్ రచ్చ.. గెలిచేది ఎవరు?

Game Changer Release Date: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో ఎప్పుడైతే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన మేనమామ పవన్ కళ్యాణ్ ను కాకుండా తన భార్య స్నేహ రెడ్డి స్నేహితురాలు భర్త శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్టు చేశారో, ఇకప్పటినుంచి బన్నీ పై మెగా అభిమానులు, మెగా వారసులు, మెగా సెలబ్రిటీలు కూడా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నాగబాబు సోషల్ మీడియా ద్వారా "మావాడు పరాయి వాడు.. పరాయివాడు మావాడు " అంటూ కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఈ వివాదం రాజుకుంటూనే ఉంది. పైగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాంబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ సినిమాకి పోటీగా రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నారు. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ లేదా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆలోపే విడుదల చేయాలని భావించిన నిర్మాత దిల్ రాజు నిన్న సాయంత్రం ఈ సినిమా డిసెంబర్ లోనే విడుదలవుతుంది అంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే అల్లు వర్సెస్ మెగా అంటూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సినిమాలను కూడా ఒకే నెలలో విడుదల చేసి అటు అభిమానులను పూర్తిస్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని చెప్పవచ్చు. పైగా ఈ సినిమా ను కొన్న బయ్యర్లకి కూడా నష్టాలు మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వల్లే సక్సెస్ అవుతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ రామ్ చరణ్ తో పోటీ పడి.. తన పై పడ్డ ముద్రను చెరిపేసుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రభాస్ కల్కి 2898AD సినిమాను జూన్ నెలలో విడుదల చేసి సేఫ్ అయ్యారు. అలాగే ఎన్టీఆర్ కూడా సెప్టెంబర్ 27వ తేదీన దేవర సినిమాను రిలీజ్ చేసి లాభాల బాట పట్టనున్నారు. కానీ వీరు మాత్రం ఇలా పంతాలకు పోయి ఒకే నెలలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు..? ఎవరికి ఎంత లాభం వస్తుంది..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.. Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..! Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.