TELUGU

Aay: ఆయ్ సక్సెస్ మీట్.. స్క్రీన్స్ పెంచుకుంటూ వెళ్తున్న సినిమా..!

Aay: నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు నటించిన ఆ సినిమాను GA2 పిక్చర్స్ బ్యానర్‌ పై అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వ్యవహరించారు. అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద సినిమాల మధ్య ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల అయ్యింది. విడుదలకి ముందు సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ.. విడుదలయ్యాక మొదటి రోజు నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా.. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో.. క్యూట్ ప్రేమ కథతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. "110 స్క్రీన్‌లతో మొదలైన ఈ సినిమా 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 స్క్రీన్స్ కి వెళ్లింది. కంటెంట్‌, మౌత్ టాక్ బాగుంటే.. చిన్న సినిమా అయినా ఏ రేంజ్ కి వెళ్తుందో, ఆయ్ నిరూపించింది. మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇప్పటికీ థియేటర్లలో 60, 70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నితిన్ గారు మాకు లక్కీ స్టార్. కథల మీద ఆయన జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. భవిష్యత్తులో కూడా నితిన్ నుండి ఫ్లాప్ సినిమా రాదని మా అభిప్రాయం. సినిమాకోసం మా డీఓపీ చాలా కష్టపడ్డాడు. ఎండాకాలంలో కూడా సినిమా వర్షకాలంలో సినిమా తీసినట్టుగా ఉండాలి అంటే దానికంటే గొప్ప విజువల్స్ ఇచ్చారు. అంజి మన మూలాల్ని అసలు మర్చిపోలేదు. అందుకే సినిమా అద్భుతంగా తీశాడు. మళ్లీ మా బ్యానర్‌లోనే అంజి సినిమా ఉంటుంది. సినిమా కోసం పని చేసిన అందరికీ థాంక్స్" అని అన్నారు. ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. వాసు రెండేళ్ల క్రితం ఈ కథను నాకు చెప్పారు. బన్నీ వాస్ మల్టీ టాలెంటెడ్. ఆయ్ కథ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది కానీ తెరపైకి ఎలా వస్తుందో అనుకున్నాను. కానీ కథ మీద మాత్రం బన్నీ వాస్ చాలా నమ్మకంగా ఉండేవాడు. నితిన్ గారు కూడా కథ బాగుండాలి. నా చుట్టూ ఉండాల్సిన పని లేదు.. కథలో నేను ఉంటే చాలు అని అన్నారు. ఆయన ఆలోచించే విధానమే ఆయనకు హిట్ లు తెచ్చి పెడుతున్నాయి. ఫ్రెండ్స్ మధ్య బ్రొమాన్స్‌ చూసి అందరూ బాగా నవ్వుకుంటున్నారు. రామ్ మిర్యాల గారు, అజయ్ గారు ఇచ్చిన మ్యూజిక్ కూడా అందరికీ నచ్చింది. నయన్ సారిక గారికి సక్సెస్ వచ్చింది. కసిరెడ్డి గారు బిజీ అయ్యారు. స్టార్‌లు లేకపోయినా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది" అని అన్నారు. డైరెక్టర్ అంజి కే మణిపుత్ర మాట్లాడుతూ.. సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు. పెద్ద సినిమాల మధ్యను వస్తుందని భయపడ్డాను. కానీ లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు తీసుకున్న నిర్ణయమే మంచిది అని అర్థమైంది. చిన్న సినిమా అయినా పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఆడియెన్స్‌కి థాంక్స్. ఎస్ కే ఎన్ గారు మా సినిమాకు చాలా సపోర్ట్ గా నిలిచారు" అని అన్నారు. నార్నే నితిన్ మాట్లాడుతూ.. ‘పెద్ద సినిమాల మధ్యలో మా ఆయ్ మూవీ వచ్చినా.. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. అంజి గారు మంచి కథ ఇచ్చారు. సమీర్ గారి విజువల్స్ చాలా బాగున్నాయి. సూఫీయానా సాంగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంకిత్, కసిరెడ్డిలతో పని చేయడం చాలా సరదాగా అయిపోయింది" అని అన్నారు. అజయ్ అరసాడ మాట్లాడుతూ.. ఆయ్ సినిమాలో కామెడీకి మాత్రమే కాక ఎమోషనల్‌గా కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు అని అన్నారు. కెమెరామెన్ సమీర్ మాట్లాడుతూ.. బన్నీ వాస్ కి మంచి విజన్ ఉంది. అంజి గారికి తనకేం కావాలో బాగా తెలుసు. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఏం కావాలి అని చాలా పర్టిక్యులర్‌గా చెప్పే. అన్ని వర్గాల ఆడియెన్స్ ఈ సినిమాను చూస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అన్నారు. Read more: Kolkata doctor murder: నన్ను బలిపశువును చేశారు.. కోర్టులో అసలు నిజాలు బైటపెట్టిన నిందితుడు సంజయ్ రాయ్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.