TELUGU

US Presidential: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌.. పోటీ నుంచి జో బైడెన్‌ ఔట్

Joe Biden Dropped Out: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి అనూహ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పుకున్నారు. పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను బైడెన్‌ విడుదల చేశారు. బైడెన్‌ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన అధ్యక్ష బరి నుంచి తప్పించుకోవాలని సొంత పార్టీ నాయకుల నుంచి డిమాండ్‌ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన వైదొలిగినట్లు తెలుస్తోంది. కాగా జో బైడెన్‌ అధ్యక్ష పోటీ నుంచి వైదొలగడంతో డెమొక్రటిక్‌ పార్టీ నుంచి ట్రంప్‌ను ఢీకొట్టెదెవరో అనేది ఆసక్తికరంగా మారింది. Also Read: Donald Trump: ట్రంప్ పై పక్కా స్కెచ్ తో దాడి.. దొరికి పోయిన దుండగుడు.. సీక్రెట్ ఏజెన్సీ తెల్పిన సంచలన విషయాలివే.. డెమొక్రటిక్‌ పార్టీ నుంచి నుంచి అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న జో బైడెన్‌ ఆరోగ్యం సక్రమంగా లేదని తెలుస్తోంది. ప్రయాణాల్లో తరచూ కిందపడడం.. బహిరంగ కార్యక్రమాల్లో మరచిపోవడం వంటివి తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఆయన కరోనా వైరస్‌ బారిన కూడా పడ్డారు. ఈ క్రమంలో అతడు అధ్యక్ష స్థానం నుంచి వైదొలుగుతారనే విస్తృత ప్రచారం జరిగింది. పార్టీ నుంచి కూడా అదే డిమాండ్‌ వ్యక్తమైంది. తాజాగా అదే నిజమైంది. అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటూ బైడెన్‌ ఒక కీలక ప్రకటన చేశారు. 'డెమొక్రటిక్‌ పార్టీ, దేశ ప్రయోజనాల కోసం అధ్యక్ష పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. అధ్యక్షుడిగా పూర్తి కాలం కొనసాగుతా' అని బైడెన్‌ లేఖలో స్పష్టం చేశారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి తాను మద్దతునిస్తానని ప్రకటించారు. తదుపరి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సూచించారు. Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్.. అనారోగ్యంతో బాధపడుతున్న బైడెన్‌ను అధ్యక్ష పోటీ నుంచి వైదొలగాలని డెమొక్రటిక్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతోపాటు మిత్ర పక్ష పార్టీల నాయకులు ఇదే విషయమై పట్టుబట్టారు. ఇటీవల కోవిడ్‌ బారినపడడంతో మరింత ఒత్తిడి పెరిగింది. ట్రంప్‌తో జరిగిన ముఖాముఖీ చర్చలో జో బైడెన్‌ తడబడిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఒత్తిడి తీవ్రమవడంతో ఆయన పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. pic.twitter.com/RMIRvlSOYw — Joe Biden (@JoeBiden) July 21, 2024 My fellow Democrats, I have decided not to accept the nomination and to focus all my energies on my duties as President for the remainder of my term. My very first decision as the party nominee in 2020 was to pick Kamala Harris as my Vice President. And it’s been the best… pic.twitter.com/x8DnvuImJV — Joe Biden (@JoeBiden) July 21, 2024 ట్రంప్‌ గెలుపు సులువే? ప్రధాన ప్రత్యర్థి తప్పుకోవడంతో అమెరికా అధ్యక్షుడిగా మరోమారు డొనల్డ్‌ ట్రంప్‌ గెలిచే అవకాశం మరింత సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి కాల్పుల ఘటనతో ట్రంప్‌కు అనూహ్యంగా మద్దతు పెరిగిన విషయం తెలిసిందే. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.