TELUGU

Indian Origin: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. అసలేం జరిగిందంటే..?

Indian Origin Brutally Murdered In America: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే అనేక మంది భారత సంతతికి చెందిన వారిని అక్కడి దుండగులు పొట్టనపెట్టుకున్నారు. ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని అమెరికాకు వెళ్లిన తమ వాళ్లు ఇలా చనిపోయి తిరిగి రావడం పట్ల భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కొందరు జాత్యంహంకార ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటారు. మరికొందరు ఒంటరిగా కన్పిస్తే చాలు.. డబ్బులు, కాస్లీ వస్తువులను కాజేస్తుంటారు. అక్కడ గన్ కల్చర్ సర్వసాధరణమని చెప్పవచ్చు. Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..? స్కూల్ పిల్లలు కూడా కొందరు గన్ ను వాడుతుంటారు. స్కూల్ లో గన్ తీసుకొచ్చి, కొన్నిసార్లు అమాయకులపై కాల్పులకు తెగబడ్డ ఘటనలు కొకొల్లలు. ఈ ఏడాది నుంచి ఇప్పటిదాక వివిధ కారణాలతో పదులు సంఖ్యలో భారతీయులు చనిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా, మరో యువకుడు అమెరికాలోని ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విషాదకరంగా మారింది. పూర్తి వివరాలు.. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన పరుచూరి అభిజిత్ అమెరికాలో ఉన్నత చదువుకు వెళ్లాడు. బుర్రిపాలెంకు చెందిన అభిజిత్ కు చిన్న తనం నుంచి అమెరికా వెళ్లాలని కలలు కనేవాడు. మంచిగా చదివి జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగాలని ఆరాటపడేవాడు. ఈ క్రమంలో అక్కడి బోస్టన్ వర్సిటీలో ఇంజినీరింగ్ లో చేరాడు. మార్చి 11 న క్యాంపస్ లో దారుణ ఘటన జరిగింది. కొందరు ఉన్మాదులు కళాశాలలోనే అభిజిట్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆతర్వాత డెడ్ బాడీని కారులో పెట్టేసి అడవిలో వదిలేశారు. ఈక్రమంలో కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన కాస్తవెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. Read More: Astrologer Venuswami: ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్లడం ఖాయం.. నిజమైన వేణుస్వామి మాటలు.. లాజిక్ భలే చెప్పేశాడుగా.. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అభిజిట్ డెడ్ బాడీని భారత్ కు తరలించే విధంగా భారత దౌత్యకార్యాలయం అధికారులు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఘటనను భారత దౌత్య వేత్త అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికాలో భారతీయులకు ప్రత్యేకంగా సెఫ్టీ దిశగా చర్యలు తీసుకొవాలని కోరారు. ఇది రెండు దేశాల మధ్య మంచి పరిణామం కాదని, వెంటనే ఇలాంటి దుండగులను అరెస్టు చేయాలని కూడా భారత అధికారులు డిమాండ్ చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.