TELUGU

Cholesterol Lower Tips: కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించే బెస్ట్ ఆయిల్ ఇదే

Cholesterol Lower Tips: ఇటీవల గత కొద్దికాలంగా హై కొలెస్ట్రాల్ ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆహారపు అలవాట్లు మారిపోవడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో కొలెస్ట్రాల్ సాధారణమైపోయింది. ఆయిలీ ఫుడ్స్, మసాలా పదార్ధాలు, ఇలా చాలా కారకాలు ప్రభావితం చూపిస్తుంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా కుకింగ్ ఆయిల్. మనం వాడే వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంటుంది. కొలెస్ట్రాల్ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ముందు వంట నూనె మార్చాలంటారు వైద్యులు. ఒక్క కొలెస్ట్రాల్ సమస్య వివిధ రకాల ఇతర అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. కొలెస్ట్రాల్ కారణంగానే డయాబెటిస్, గుండె వ్యాధులు వంటి ఇతర సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ నేపధ్యంలో వంట నూనె తప్పకుండా మార్చాల్సి ఉంటుంది. మరి ఏ నూనె మంచిదో తెలుసుకుందాం. ఎందుకంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం ఆయిలీ పదార్ధాలే. శరీరంలో కొవ్వు పరిమితి దాటి ఉన్నప్పుడు ఆయిలీ పదార్ధాలు తినడం వల్ల ప్లక్ ఏర్పడుతుంది. ఇవ ధమనులకు అంటుకుని ఉంటుంది. ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే ర్త నాళాలు బ్లాక్ అవుతుంటాయి. ఫలితంగా రక్తం గుండె వరకూ చేరడంలో ఆటంకం కలుగుతుది. దాంతో రక్త సరఫరాపై ఒత్తిడి పెరిగి రక్తపోటుకు దారి తీస్తుంది. హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఫ్లక్స్ సీడ్స్ ఆయిల్ వినియోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఫ్లక్స్ సీడ్స్ అనేవి ఫ్లక్స్ అనే మొక్క నుంచి వస్తాయి. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఓలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసి్, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. Also read: Remedies for Constipation: ప్రేవుల్ని సమూలంగా క్లీన్ చేసే 5 చిట్కాలు, మల బద్ధకం సమస్యకు ఇక చె స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - Apple Link - మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.