TELUGU

Double iSmart Movie Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. రాడ్ అనుకుంటే సూపర్ హిట్.. పబ్లిక్ మాస్ టాక్

Double iSmart Review and Rating: మరోసారి బాక్సాఫీసును షేక్ చేసేందుకు హిట్ కాంబో రామ్ పోతినేని-పూరీ జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. ట్రైలర్‌ను బట్టి మాస్ మసాలా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది. ఇస్మార్ట్ శంకర్‌ మూవీలో ఉన్న ఈ ఊపునే ఇందులోనూ కొనసాగించినట్లు అర్థమవుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా యాక్ట్ చేయడంతో హిందీలోనూ ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. స్కంద మూవీతో రామ్.. లైగర్ మూవీతో పూరీ జగన్నాథ్ బాగా దెబ్బ తిన్నారు. మరీ డబుల్ ఇస్మార్ట్‌తో ఇద్దరు హిట్ అందుకున్నారా..? ఇస్మార్ట్ శంకర్ మూవీ మ్యాజిక్ పని చేసిందా..? ట్విట్టర్‌లో ఆడియన్స్ టాక్ ఎలా ఉంది..? ఓ లుక్కేద్దాం పదండి.. డబుల్ ఇస్మార్ట్‌కు ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు పూర్తవ్వడంతో ఆడియన్స్ రివ్యూలు ఇస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ ఒదిగిపోయాడని మెచ్చుకుంటున్నారు. ఎనర్జిటిక్ స్టార్‌ క్యాప్షన్‌కు సరిపోయేలా చాలా ఎనర్జీతో కనిపించాడని అంటున్నారు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్‌ చూశామని.. పూరీ పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అని పోస్టులు పెడుతున్నారు. డిప్‌లో సిమ్ కార్డు యాక్టివేట్ అయింది.. రామ్ పొతినేని మాస్ ఎంట్రీ ఇచ్చాడని చెబుతున్నారు. First Half Completed #DoubleISMART Perfect comeback for #PuriJagannadh Dippu lo Sim card Activated #Rampothineni Mass entry 🔥 🔥 🔥 Waiting for second half.. #DoubleISMARTReview #DoubleismartonAug15th @ramsayz @PuriConnects pic.twitter.com/1wKtP0ruC1 — Bharath Nallampati 🇮🇳 (@Nallampati9999) August 14, 2024 Prathodu #DoubleISMART review Lo @ramsayz Energy Ani Separate Ga Mention Cheastunaaru RAM Ante ENERGY ENERGY Ante RAM 🔥 pic.twitter.com/8MDYBtg1KD — Løve Deepak🔱 (@RAPOCult4ever) August 14, 2024 మరో నెటిజన్ మిస్టర్ బచ్చన్ మూవీతో పోల్చాడు. పక్కా హిట్ అనుకున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఆల్మోస్ట్ ఫ్లాప్ అయిందని.. రాడ్ అవుతుందని అనుకున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ హిట్ దిశగా వెళుతుందని అన్నాడు. లైగర్ మూవీ నష్టాల నుంచి పూరీ, చార్మి కోలుకుంటారేమోనని పోస్ట్ చేశాడు. Pakka hit ankuna mr.bachan flop aindi almost Rod avthadi ankuna ismart towards hit/superhit I think charmee n puri recovers liger looses with this movie #DoubleISMART — saikrishna kakarla (@saikrishnakaka) August 14, 2024 రామ్-సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్లు అలరిస్తాయని నెటిజన్లు చెబుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని.. ఈ సినిమాలో ఇంకా డబుల్ అయిందంటున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అదిరిపోయాయని.. ప్రేక్షకులను మెప్పిస్తాయంటున్నారు. 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్‌కు రామ్ దుమ్ములేపే స్టెప్పులు వేశాడని అంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీలో ఉన్నారు. #DoubleISMART >>> #MrBachan Decent 1st half 🤙 Background music and dialogues bagunnai👍 2nd half same tempo unte hit confirm cheskovachuu #DoubleISMART — JA$HU’NTR’ (@Jashu_Chowdary9) August 14, 2024 #DoubleISMART 🔥🔥🔥 — AbhiRAM 🔱 (@abhiram1175) August 15, 2024 #DoubleISMART Review: #RAPO Mass rampage 💥👏.Vera level energy. #PuriJagannadh sir's comeback movie 💥👏. Mass Dialogues superb songs 💥🤯🎉 #manisharma bgm was awesome Action sequences were top notch. Vera level worth watch film 💥🤯🍿 Rating:3.5 @PuriConnects @ramsayz pic.twitter.com/dDA7Qauh74 — Vamsi Varma (@KvvVamsi) August 15, 2024 None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.