TELUGU

Banana Stem: అరటి కాండంని ఇలా తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ మాయం...!

Health Benefits Of Banana Stem: అరటి పండు ఎంతో ప్రసిద్ధి చెందినప్పటికీ దాని కాండం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని చాలామందికి తెలియదు. అరటి కాండం ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.వీటితో పాటు విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో, అరటి కాండాన్ని మూలా అని పిలుస్తారు. ఇది తీవ్రమైన జ్వరం, అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగించబడుతుంది. అరటి కాండం తీపి, చల్లటి స్వభావం కలిగి ఉంటుంది. పిత్త దోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. దీని తినడం వల్ల కలిగే లాభాలు: అరటిపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని మనకు తెలుసుకు, కానీ దీని కాండం తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ కాండం జ్వరాన్ని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వార్షకాలంలో కలిగే సాధారణ అనారోగ్య సమస్యలు కూడా దూరం చేస్తుందని అంటున్నారు. మూత్రపిండాలను శుభ్రపరచడంలో అరటి కాండం ఎంతో మేలు చేస్తుంది. దీని కీడ్నీ సమస్యతో బాధపడేవారు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. కొంతమంది చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వారు కూడా ఈ కాండం తినడం వల్ల దురద, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో ఉండే వ్యర్థలను తొలగించడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ అరటి కాండంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఈ కాండంతో తయారు చేసే జ్యూస్‌ను తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటారు. అరటి కాండాన్ని ఎలా ఉపయోగించాలి? రసం: అరటి కాండాన్ని బ్లెండర్‌లో తరిగి రసం తీసుకోవచ్చు. సలాడ్: ఇతర కూరగాయలతో కలిపి సలాడ్‌గా తీసుకోవచ్చు. సూప్: సూప్‌లో కూడా చేర్చుకోవచ్చు. ముఖ్యమైన విషయాలు: అరటి కాండం కొంచెం చేదుగా ఉంటుంది. దాని రుచిని మెరుగుపరచడానికి నిమ్మరసం లేదా బెల్లం కలుపుకోవచ్చు. అలర్జీ ఉన్నవారు దీన్ని తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు దీన్ని తీసుకోవడానికి ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి. గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, తప్పకుండా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.