TELUGU

Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌! పే కమిషన్‌లకు స్వస్తి.. అమల్లోకి పనితీరు ఆధారిత చెల్లింపు?

Pay Commission Latest Update: ప్రస్తుత విధానం ప్రకారం ప్రాథమిక వేతనం వేతన సంఘం (పే కమిషన్‌) ద్వారా నిర్ణయించబడింది. జీతం పెరుగుదల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇది త్వరలోనే మారనుందని ప్రచారం జరుగుతోంది. కొత్తగా రానున్న విధానంలో జీతంలో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుందని తెలుస్తోంది. పనితీరు లేదా ప్రతిభ ఆధారంగా జీతాల చెల్లింపు విధానం (పర్ఫామెన్స్ బేస్డ్ పే సిస్టమ్) అనే కొత్త విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. పనితీరు ఆధారిత చెల్లింపుతో ఉద్యోగుల జీతాలు ద్రవ్యోల్బణం, ఉద్యోగుల పనితీరు ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ పద్ధతి మరింత లాభదాయకమని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరిలో సమర్పించే కేంద్ర బడ్జెట్‌లో దీనిని అధికారికంగా అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్న మాట. Also Read: PMSBY Details: చిన్న చాక్లెట్‌ ఖర్చుతో రూ.4 లక్షల బీమా.. ఆదమరిస్తే కుటుంబం రోడ్డుపాలు 8వ వేతన సంఘం, దాని భర్తీ విధానం గురించి కొన్ని వారాలుగా ఆసక్తికర చర్చలు జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇప్పటివరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త పే కమిషన్‌ (వేతన సంఘం) ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత 7వ వేతన సంఘం 20214లో ప్రకటించగా.. 2016లో అమల్లోకి వచ్చింది. దీని గడువు 2026లో ముగుస్తున్న విషయం తెలిసిందే. అంటే 2026 నాటికి తదుపరి వేతన సంఘం.. అంటే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి దాని సిఫార్సులను అమలు చేయాలి. Also Read: Special Trains: సంక్రాంతికి ప్రత్యేక రైళ్లకు రేపటి నుంచే బుకింగ్‌.. రిజర్వ్‌ చేసుకోవడం ఇలా అయితే 8వ వేతన సంఘాన్ని ఇప్ప‌ట్లో ఏర్పాటు చేసే ప్ర‌స‌క్తి లేద‌న్న‌ది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వేతన సంఘం లేకపోవడంతో వేతన సవరణ ఎలా జరుగుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. పదేళ్లకు ఒకసారి ఏర్పాటుచేసే వేతన సంఘం స్థానంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందిస్తుందనే ప్రచారం జరుగుతోంది. వేతన సవరణ కోసం కొత్త ఫార్ములాను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. జీతాల పెంపుల లెక్కింపు కోసం ఐక్రియోట్ ఫార్ములాను ఉపయోగించడంపై ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త పద్ధతి ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛనుదారుల పెన్షన్‌లో భారీగా పెంపుదల ఉంటుందనే ఆశాభావంలో ఉద్యోగ వర్గాలు ఉన్నాయి. కొత్తగా రానున్న పెర్ఫార్మెన్స్ బేస్డ్ పే సిస్టమ్ అనే కొత్త విధానంలో ఉద్యోగుల జీతాలు ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త విధానంలో ద్రవ్యోల్బణం రేటు, ఉద్యోగుల పనితీరు రెండింటి ఆధారంగా ఉద్యోగుల జీతం, డియర్‌నెస్ అలవెన్స్ నిరంతరం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల కొనుగోలు శక్తి మెరుగుపడే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారి పనితీరు ఆధారంగా వేతనాలు పెంచబోతున్నారని దీని సారాంశం. ఇప్పుడు కూడా స్టాండర్డ్ పే ప్రకారం జీతం పెరుగుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వేతన పెంపుదల పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో 14 పే గ్రేడ్‌లు ఉన్నాయి. ఉద్యోగి నుంచి అధికారి వరకు అందరూ అన్ని పే గ్రేడ్‌లలో చేర్చబడ్డారు. దీంతో వారి జీతంలో పెద్దగా మార్పు లేదు. కొత్త విధానంలో ఉద్యోగులందరికీ సమాన ప్రయోజనాలను అందించాలనే వాదన వస్తోంది. అవగాహన కల్పించడం కోసమే! ఈ పోస్ట్ సమాచారం కేవలం అవగాహన కోసం అందిస్తున్నది మాత్రమే. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు, డియర్‌నెస్ అలవెన్స్ తగ్గింపు లేదా కొత్త పే రివిజన్ స్కీమ్‌పై జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే మేం అందిస్తున్నాం. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సంప్రదించాలని జీ తెలుగు న్యూస్‌ సూచిస్తున్నది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.