TELUGU

Snakes in Dream: కలలో పాములు కన్పిస్తున్నాయా..?.. మీకు వంద శాతం జరిగేది ఇదేనంట..!

Dreaming about snakes effect in human life: సాధారణంగా మనకు కలలో కన్పించే కొన్ని జంతువులు మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతుంటారు. దీని వల్ల రానున్న విపత్తు నుంచి బైటపడొచ్చని అంటుంటారు. అయితే.. కలలో ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది తరచుగా పాములు కన్పిస్తున్నాయని చెబుతుంటారు.పాములు ఎందుకు కన్పిస్తాయి. దాని వల్ల కలిగే ప్రభావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది యువత.. పెళ్లిళ్లు కాకుండా తెగ ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరు జీవితంలో ఎలాంటి ఎదుగు, బొదుగు లేకుండా అలానే ఉండిపోతుంటారు. అంతే కాకుండా.. జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆస్తి లావాదేవీలు, ఇంటి సంబంధ సమస్యల్ని ఎదుర్కొంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం పాములు కనపడే విధానంను బట్టి కూడా అవి ఇలాంటి ఫలితాలను ఇస్తాయంట. పాములుకలలో కాటు వేసినట్లు కన్పిస్తే.. రాబోయే ప్రమాదాలకు సంకేతం ఇస్తున్నట్లు అంట. అదే విధంగా పాములు కుడి నుంచి ఎడమకు దాటితే.. అప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం లభించినట్లు అని సూచన అంట. తెలుపు రంగు శ్వేత నాగు కలలో కన్పించడం మంచిదని చెప్తుంటారు. దీని వల్ల ఆకస్మిక ధనలాభం కల్గుతుందంట. అంతేకాకుండా..నల్లని లేదా గోధుమ రంగు సర్పాలుకన్పిస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకొవాలంట. Read more: Shani Sade sati: ఈ రాశికి మార్చిలో శని సడేసతి నుంచి పూర్తి ఉపశమనం.. ఏడున్నరేళ్ల కష్టాలకు విరామం..! అయితే..చనిపోయిన వారుకోపంగా ఉంటే.. నల్లని పాములు, ఎక్కువగా సర్పాలు కలలో వస్తాయంట. అందుకే పాములు తరచుగా కలలో కన్పిస్తే.. జంట నాగులకు పాలాభిషేకం చేయించాలి. అంతేకాకుండా.. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు వెళ్లి పూజలు జరిపించాలి. నాగ ప్రతిష్టాపన చేయిస్తే.. ఈ దోషాలన్ని పోతాయని పండితులు చెబుతుంటారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.