Brahmamudi Today January 7 Episode: కారులో ఇద్దరూ హడావుడిగా వెళ్తుంటారు. లేట్ అయిపోయిందని స్పీడ్‌గా వెళ్లి ఫోటోకు దండ వేసుకోవడం ఎందుకు మెల్లిగా వెళ్లండి అంటుంది. అప్పుడు మీరు ప్రెజంటేషన్ ఇవ్వాలంటే ఫైల్ ఉండాలి కదా అంటుంది కావ్య. ఏంటండి మీరు నా డిజైన్స్ అన్ని అందులోనే ఉన్నాయి మీరు కార్ తీసుకుని ఆఫీస్‌కు వెళ్లండి నేను దిగి ఇంటికి వెళ్లి తీసుకువస్తా అని కారు దిగిపోతుంది కావ్య. ఆఫీసుకు చేరుకుంటాడు రాజ్. సెక్యూరిటీ కావ్య మేడం రాలేదేంటి అనుకుంటాడు. శృతి లోపల ఉన్న నగలు తీసుకువచ్చి కాన్ఫరెన్స్ హాల్‌లో నీట్‌గా పెట్టించు అంటాడు. మరోవైపు సెక్యూరిటీ అనామికకు కాల్ చేస్తాడు. చిన్న కన్ప్యూజన్ మేడం కావ్య మేడం ఆఫీస్ రాలేదు అంటాడు. నేను చూసుకుంటా అని కాల్ కట్ చేస్తుంది అనామిక. చేయాల్సింది నిన్నే చేశాం కదా అంటాడు సామంత్. సరిపోదు ఆ జగదీష్ గాడు నఖిలీ బంగారం అమ్మతావా? అని ఇన్‌సల్ట్ చేయాలి దగ్గరుండి కావ్య బాధపడాలి అని కావ్యకు కాల్ చేస్తుంది. కాల్ రిసీవ్ చేసుకుంటుంది కావ్య నువ్వేంటి ఆఫీస్‌లో జగదీష్‌తో అక్షితలు వేసుకోకుండా బయట ఉన్నావేంటి అంటుంది అనామిక. ఇంకాసేపట్లో మీకు ఆఫీసులో జరగబోయే నష్టం గురించి చెబుతున్న. మీ ఆయనకు ఎప్పుడు లేని జరిగే అవమానం గురించి చెబుతున్న. నన్ను అవమానిస్తావా? అందుకే రిటర్న్ గిఫ్ట్ కోసం ఎదురు చూశా. విన్నావు కదా.. వెళ్లు, వెళ్లు త్వరగా వెళ్లు లైఫ్ పార్ట్నర్ కదా నువ్వు కూడా వెళ్లి షేర్ చేసుకో.. అనామికతో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావు అని గుర్తు పెట్టుకోమ్మ పెట్టేయ్ ఫోన్ గట్టిగా అరిచి ఫోన్ కట్ చేస్తుంది అనామిక. కావ్యకు ఏం జరుగుతుందో అని డౌట్ వస్తుంది. పాపం, ఆయన ఎలా ఉన్నారో ఏంటో అని కాల్ చేస్తుంది. జగదీష్ రావడంతో టేబుల్‌పైనే ఫోన్ పెట్టి వెళ్లిపోతాడు రాజ్. ప్రెజెంటేషన్ రూమ్‌కు తీసుకెళ్తాడు రాజ్. ఆభరణాలు అన్ని చూపిస్తాడు.ఎలా ఉన్నాయి సార్, మీరు కోరుకున్నట్లే ఉన్నాయా? అంటాడు రాజ్. బాగున్నాయి అంటాడు జగదీష్ ఆక్రెడిట్ కావ్యదే సార్ అంటాడు రాజ్. సరే మా అప్రైజల్ క్వాలిటీ చెక్ చేస్తాడు అంటాడు. ఒక్కో నగ తీసుకుని చెక్ చేస్తూ ఉంటాడు.ఆర్నమెంట్స్ అన్ని పెర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్ అని కిరీటం తీస్తాడు. చెక్ చేసి రాజ్ ముఖం చూస్తాడు. ఈ కిరీటం గోల్డ్‌ది కాదు సార్ నఖిలీది అంటాడు. నో..నో ఈ కంపెనీలో అలా జరగదు వందేళ్ల చరిత్ర ఉన్న ఈ స్వరాజ్ గ్రూప్‌లో ఆ అవకాశం ఉండదు అంటాడు జగదీష్. ఒరిజినల్ ఏది అంటాడు ఇదే ఒరిజినల్ సార్ అంటాడు రాజ్. మా అప్రైజల్ చెప్పాడు కదా.. మీ తాతయ్య నా ఫ్రెండ్ కాబట్టి ఆయన్ని నమ్మి ఇంత పెద్ద కాంట్రాక్ట్ మీ చేయికి ఇస్తే కిరీటాన్ని మాయ చేసి ఆప్లేసులో డమ్మీ పెడతారా? మిమ్మల్ని నమ్మి ఆ కిరీటాన్ని గుడికి ఇస్తే నా పై నమ్మకం పోతుంది ఒరిజినల్ కిరీటం ఏది అంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. స్టాప్ ఇట్ మిమ్మల్ని నమ్మి కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్ మీకు అందిస్తే ఫ్రాడ్ చేస్తారా? అంటాడు. ఏం జరిగింది సార్ అని కావ్య అంటుంది. నీకు జరగకుండా జరిగిందా? అంటాడు. నఖిలీ కిరీటం పెట్టి మోసం చేస్తారా? అంటాడు. ఎలా జరిగింది నాకు అర్థమవ్వడం లేదు అంటాడు.నాకు అర్థమైంది అంటుంది కావ్య. మీ బాబాయ్ లాగా నువ్వు మర్చిపోయావు. ఒరిజినల్ కిరీటం భద్రంగా ఉంది. డెమో కిరీటం కోసంపెట్టింది ఇచ్చారు.సారీ అండీ నేను నిన్న మీకు చెప్పాను అంటుంది కావ్య. రండీ, మీ చేతులతోనే ఆ కిరీటం తీసుకువచ్చి పెట్టండి రండి మీరు అని కావ్యను తీసుకువెళ్లి కిరీటం తెప్పిస్తుంది. రాజ్ ఆ కిరీటం పట్టుకువస్తాడు. ఇదే.. అసలైన మేలిమి బంగారంతో చేసిన కిరీటం చెక్ చేసుకోండి అంటుంది కావ్య. అప్రైజర్ చెక్ చేసి ఒరిజినల్ గోల్డ్ తో చేసింది సార్ అంటాడు. ఏంటి సార్? కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా దుగ్గిరాల మనవడిని అవమానిస్తారా? అంటుంది కావ్య.. మీరు కచ్చితంగా రాజ్‌కు సారీ చెప్పాల్సిందే అంటుంది కావ్య. భగవంతుడికి సమర్పించే ఆభరణాల్లో గురివింద గింజ కూడా ఏ లోహంకలిపినా ఆ పాపం మాకు తగులుతుంది. వెంటనే సెక్యూరిటీ అనామికకు కాల్ చేస్తాడు. డూప్లికేట్ కిరీటం పెట్టుకుని అనామిక రాజ్ కంపెనీపై దుష్ర్పచారం చేద్దాం అని చెబుతుంది. కాల్ లిఫ్ట్ చేస్తుంది చెప్పు.. ఆ జగదీష్ కేసు పెడతా అంటున్నాడా? అంటుంది అనామిక. ఏంటి నువ్వు దొరికిపోయావా? అంటుంది. హుమ్.. దానికి అన్ని తెలివితేటలు ఉంటే బంగారు కిరీటం నా దగ్గర ఎందుకు ఉంటుంది అంటుంది అనామిక. అప్పుడు సెక్యూరిటీ మీ దగ్గర ఉంది డూప్లికేట్ కిరీటం అంటాడు, ఇక ఖంగు తినడం అనామిక వంతు అవుతుంది. ఇదీ చదవండి: ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు కొనుగోలు చేయవచ్చు? మీకు తెలుసా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None
Popular Tags:
Share This Post:
China Virus: చైనా వైరస్ తో డేంజర్ బెల్స్.. దేశంలో ఐదు కేసులు..
- by Sarkai Info
- January 7, 2025
Brahmamudi: మాయ చేసిన కావ్య.. కంగుతిన్న అనామిక, రాజ్ చేతిలో అసలైన బంగారు కిరీటం..
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
HMPV New Cases In Chennai: ఇద్దరు చిన్నారులకు సోకిన చైనా వైరస్.. భయాందోళనలో ప్రజలు..!
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Vishal Health: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ప్రముఖ హీరో విశాల్.. అసలు ఏం జరిగింది?
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.