TELUGU

Jasprit Bumrah: ఇంగ్లండ్ సిరీస్‌కు బూమ్రా అవుట్, తీవ్రమైన వెన్ను నొప్పి

Jasprit Bumrah: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా 1-3 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. సిరీస్ కోల్పోవడమే కాకుండా టెస్ట్ ర్యాంకింగ్ స్థానాన్ని దిగజార్చుకుంది. ఈ సిరీస్‌లో అద్బుతంగా రాణించిన జస్ప్రీత్ బూమ్రా అనారోగ్యం ఆందోళన కల్గిస్తోంది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇప్పుడు టీమ్ ఇండియా ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌పై దృష్టి సారించింది. ఇంగ్లండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 5 టీ20 మ్యాచ్‌లు, 3 వన్డేలు జరగనున్నాయి. మొదటి టీ20 జనవరి 22వ తేదీన జరగనుంది. ఈ సిరీస్‌కు టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా దూరం కానున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బూమ్రా ఐదు టెస్టుల్లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో బూమ్రా ఏకంగా 150 ఓవర్లు బౌల్ చేశాడు. దాంతో ఒత్తిడి, భారం పెరిగి తీవ్రమైన వెన్ను నొప్పికి దారితీసింది. వెన్ను నొప్పి కారణంగానే బూమ్రా ఐదవ టెస్ట్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతనికి పూర్తి స్థాయిలో విశ్రాంతి అవసరమని అటు వైద్యులు ఇటు టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇప్పుడు విశ్రాంతి ఇస్తేనే ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకు అందుబాటులో రాగలడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ 2025కు బూమ్రాను సిద్ధం చేసేందుకు వైద్య బృందం నిమగ్నమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. బూమ్రా వెన్ను నొప్పి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఇంకా తెలియలేదు. గ్రేడ్ 1 స్థాయిలో ఉంటే కోలుకునేందుకు 2-3 వారాలు పట్టవచ్చు. గ్రేడ్ 2 స్థాయిలో 6 వారాలు విశ్రాంతి అవసరం. ఇక గ్రేడ్ 3 స్థాయిలో నొప్పి ఉంటే మాత్రం పూర్తిగా 3 నెలల విశ్రాంతి ఉండాల్సిందే. అందుకే ఇంగ్లండ్ సిరీస్‌కు పూర్తిగా విశ్రాంతి ఇచ్చి..ఛాంపియన్స్ ట్రోఫీకు సిద్ధం చేసే ఆలోచనలో టీమ్ ఇండియా ఉంది. Also read: Sunil Gavaskar: మాకేం క్రికెట్ తెల్వదు.. వాళ్ళకి చెప్పడానికి మేం సరిపోము.. టీమిండియాకు ఇచ్చి పడేసిన లెజెండరీ క్రికెటర్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.