TELUGU

HMPV Virus: దేశంలోకి చొచ్చుకొస్తున్న చైనా HMPV వైరస్.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?

HMPV Lockdown: మానవాళిని మరో వైరస్‌ వణికిస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇంకా మానవ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుని ఊపిరి పీల్చుకుంటుండగా మళ్లీ అలాంటి భయంకరమైన వైరస్‌ ముప్పు పొంచి ఉంది. చైనా నుంచే ఆ వైరస్‌ ప్రపంచంపై దాడి చేస్తోంది. ఇప్పటికే డ్రాగన్‌ దేశంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడగా.. తాజాగా భారత్‌లోకి ఆ మహమ్మారి వైరస్‌ ప్రవేశించింది. ఈ నేపథ్యలంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ మాదిరి ఆ వైరస్‌ విజృంభిస్తుందా? అని చర్చించుకుంటున్నారు. కరోనా మాదిరి విస్తరిస్తే మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడతాయా అనే చర్చ జరుగుతోంది. అసలు ఆ వైరస్‌ ఏమిటి? ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? మళ్లీ లాక్‌డౌన్‌ ఉందా? అనేది తెలుసుకుందాం. Also Read: China Virus: తస్మాత్ జాగ్రత్త.. భారత్ లో అడుగెట్టిన చైనా వైరస్.. తొలి కేసు నమోదు.. భారత్‌లోకి ప్రవేశం చైనాలో హ్యుమన్‌ మెటానిమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ) వ్యాపిస్తోంది. దాంతోపాటు ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ వైరస్‌లు కూడా ప్రబలుతున్నాయి. అక్కడ లక్షల సంఖ్యలో వైరస్‌ కేసులు పెరుగుతుండగా.. మృతులు కూడా వందల సంఖ్యలో ఉన్నారని తెలుస్తోంది. చైనా వివరాలు బహిర్గతం చేయరు. దీనివలన అక్కడ ఆ వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందనేది తెలియడం లేదు. కానీ పరిస్థితి మాత్రం భయానకంగా ఉందని తెలుస్తోంది. తాజాగా హెచ్‌ఎంపీవీ వైరస్‌ భారత్‌లోకి కూడా పాకింది. కర్ణాటకలోని బెంగళూరులో రెండు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో, పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా ఒక్కో కేసు నమోదైంది.ఒకే రోజు నలుగురికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగించే అంశం. Also Read: Game Changer: గేమ్ చేంజర్ ఈవెంట్‌లో అపశ్రుతి.. గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ దిగ్భ్రాంతి దేశంలోకి వైరస్‌ కేసులు నమోదు కావడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. 'ఎలాంటి ఆందోళన చెందొద్దు' అని సూచించింది. ముందస్తు చర్యలు తీసుకుని వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము అప్రమత్తంగా ఉన్నామని ప్రకటన చేసింది. కేంద్ర ప్రకటనతో ప్రజల్లో ఆందోళన తొలగడం లేదు. గతంలో కరోనా వైరస్‌ విషయంలో ఇలాంటి ప్రకటన చేయగా.. తర్వాత యావత్‌ దేశాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హెచ్‌ఎంపీవీ కూడా కరోనా మాదిరి వ్యాపిస్తుందని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. లాక్‌డౌన్‌ తప్పదా? కరోనా వైరస్‌ మహమ్మారితో భారతదేశం గజగజ వణికిపోయిన విషయం తెలిసిందే. లక్షల్లో ప్రాణాలు కోల్పోగా.. కోట్ల మందికి కరోనా బారిన పడ్డారు. ఆ వైరస్‌ వ్యాపించకుండా లాక్‌డౌన్‌ విధించారు. పలు విడతల వారీగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మానవ ప్రపంచం ఇంటికే పరిమితమైన రోజులు ఇంకా అందరి కళ్ల ముందు తిరుగుతున్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందా? అని అందరిలో మెదలుతున్న ప్రశ్న. హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యాప్తిపై ఇప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి. ఆ వైరస్‌పైన ఇంకా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అధ్యయనం చేయాల్సి ఉంది. కరోనా వైరస్‌ మాదిరి విస్తరించే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. అయితే ఈ వైరస్‌ చిన్నారులకు సోకే ప్రమాదం ఎక్కువ ఉండడంతో పిల్లలు ఉన్నవారు జాగ్రత్త ఉండాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే వైరస్‌తో ప్రమాదం లేనట్టు కనిపిస్తోంది. వైరస్‌ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంటే మాత్రం ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి ఉండవచ్చు. లాక్‌డౌన్‌పై సమయమే సమాధానం ఇస్తుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook , Twitter None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.