TELUGU

Stock market: వైరస్ భయం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు మార్కెట్ విజార్డ్ అనిల్ సింఘ్వీ చెప్పిన సూచనలివే

Stock market crash: భారత స్టాక్ మార్కెట్‌లు సోమవారం భారీ పతనం నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు 1.75 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 78,000 దిగువకు పడిపోయింది. నిఫ్టీ 23,600 స్థాయి దిగువకు చేరుకుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు 200 డిఎంఏ దిగువకు పడిపోయాయి. అంటే నిఫ్టీ ఈరోజు టెక్నికల్ చార్ట్‌లో చాలా ముఖ్యమైన స్థాయిలను బ్రేక్ చేసింది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎమ్‌పివి వైరస్ భయం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. చైనాలో వ్యాపించిన ఈ వైరస్ మూడు కేసులు భారతదేశంలో వెలుగు చూసిన వేళ పెట్టుబడిదారులలో భయాందోళనలు పెరిగాయి. దీంతో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చైనీస్ వైరస్ హెచ్ఎంపీవీ భారత్ లోనూ తాజాగా మూడు కేసులు వెలుగుచూశాయి. దీంతో స్టాక్ మార్కెట్లు కోవిడ్ కాలాన్ని ప్రజలకు గుర్తు చేశాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అనిల్ సింఘ్వి తెలిపారు. ఈ పరిస్థితి కోవిడ్ అంత తీవ్రంగా లేనప్పటికీ, భయం కారణంగా మార్కెట్‌లో అమ్మకాల వాతావరణం ఏర్పడింది. ఇది కాకుండా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) విక్రయించడం మార్కెట్‌పై మరింత ఒత్తిడి పెంచింది. భయానక వాతావరణంలో, కొనుగోలుదారులు కూడా వెనక్కి తగ్గారు. దీని కారణంగా అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగిందని తెలిపారు. Also Read: HMPV: గుజరాత్‌లో తొలి చైనా వైరస్‌ కేసు.. భారత్‌లో మూడో హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌..! ఇలాంటి భయాందోళనల వాతావరణంలో, పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉండాలని సూచించామని అనిల్ సింఘ్వీ అన్నారు. HMPV వైరస్‌తో తదుపరి ఏమి జరుగుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కోవిడ్ అనుభవం నుండి నేర్చుకుని, పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈ హెచ్చుతగ్గులు వ్యాపారులకు ఖరీదైనవి, కాబట్టి మార్కెట్‌లో తేలికగా ఉండటం మంచిది. ఈ సమయంలో, కొనుగోలు, అమ్మకం రెండింటిలోనూ లోపం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడిని క్రమశిక్షణతో ఉంచడం మంచిదని సూచించారు. భయంతో కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోవాలన్నారు. స్టాక్ ఇన్ యాక్షన్: థైరోకేర్ HMPV వైరస్ కారణంగా రోగనిర్ధారణ విభాగంలో గందరగోళం పెరిగింది. థైరోకేర్ వంటి షేర్లు ఫోకస్‌లో ఉన్నాయి. ఎందుకంటే అవి నేరుగా హెల్త్ చెకప్, డయాగ్నోస్టిక్స్‌కు సంబంధించినవి కాబట్టి థైరోకేర్ షేర్లు ఈరోజు 12% పెరిగి రూ.1026 వద్ద ట్రేడవుతున్నాయి. పెట్టుబడిదారులు తమ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే మార్కెట్‌లో అడుగులు వేయాలని సూచించారు. Also Read: సంక్రాంతికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ కారుపై ఏకంగా 3 లక్షల వరకు డిస్కౌంట్..పండుగ ఆఫర్ అదరహో స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.