TELUGU

Zoo Park Flyover: రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం.. జూపార్క్‌ ఫ్లైఓవర్‌కు మన్మోహన్‌ సింగ్‌ పేరు

Zoo Park Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు కొంత తొలగనున్నాయి. హైదరాబాద్‌ శివారులోని జూపార్క్‌-ఆరాంఘర్‌ మధ్య నాలుగు కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. నాటి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పేరు పెట్టాలని నిర్ణయించారు. Also Read: KT Rama Rao: 'మోసం.. దగా.. నయవంచనకు కేరాఫ్‌ కాంగ్రెస్ పార్టీ.. రేవంత్‌ రెడ్డి' జూపార్క్‌-ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ను సోమవారం ప్రారంభోత్సవం అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. 'వైఎస్సార్‌ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించుకున్నాం. మళ్లీ ఇప్పుడు రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకుని మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నాం' అని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 'ఆనాడు నిజాం హయాంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించి హైదరాబాద్ తాగునీటి సమస్యను తీర్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ.. మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉంది' అని రేవంత్‌ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా మేం సిద్ధమని ప్రకటించారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎం పార్టీని కలుపుకుని ముందుకు వెళతామని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, నగర అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతామన్నారు. Also Read: DK Aruna రేవంత్‌ రెడ్డిపై పాలమూరు అరుణమ్మ ఆగ్రహం.. 'చేతగాకపోతే.. ముక్కు నేలకు రాసి దిగిపో' 'రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు వెళుతుంది. ఇది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ.. ఒరిజినల్ హైదరాబాద్' అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. 'మీరాలం ట్యాంక్‌పై కేబుల్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం' అని ప్రకటించారు. 'అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడి ప్రజా ప్రతినిధులదే. త్వరలోనే గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. ఈ ఫ్లై ఓవర్‌కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నా' అని రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.