TELUGU

HMPV : చైనాలో HMPV కలకలం.. అప్రమత్తమైన భారత్.. కేంద్ర వైద్యారోగ్యశాఖ సమీక్ష

India well-prepared : చైనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన శనివారం జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. చైనాలో హెచ్ఎంపీవీ వైరల్ కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి భారత్ లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఈ సమావేవంలో నిపుణులు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పొరుగుదేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. డబ్య్లూహెచ్ఓ కూడా ఆ దేశంలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. ముందస్తు చర్యల్లో భాంగా హెచ్ఎంపీవీ వైరస్ టెస్టింగ్ లేబొరేటరీలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తోందని తెలిపింది. చలికాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ ఫ్లూయెంజా, ఆర్ఎస్ వీ, హెచ్ఎంపీవీ వంటి వైరస్ లు వ్యాప్తి చెందుతున్నాయని జేఎంజీ తెలిపింది. భారత్ లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఆర్ఎస్ఐ, హెచ్ఎంపీవీ వంటి పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక వేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. Also Read: Success Story: జ్యోతి...ఖండాంతరాల ఖ్యాతి.. అనాథాశ్రమంలో పెరిగి. .నేడు బిలియన్ డాలర్ల కంపెనీకి సీఈవో ఈ సమావేశానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెల్, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం,నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్ వంటి సంస్థల ఉన్నతాధికారులు ఎయిమ్స్,ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు హాజరయ్యారు. Also Read: SBI Account: SBI అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ రెండు కొత్త డిపాజిట్ స్కీములలో అధిక వడ్డీ పొందవచ్చు.. పూర్తి వివరాలివే. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.