Brahmamudi Today January 6 Episode: కంగ్రాట్స్ అని రాజ్ అంటాడు. దీంతో శృతి, పీఏలు కూడా చెబుతారు. మనకు కాదు జగదీష్ గారికి నచ్చాలి అంటాడు. అప్పుడు ఒక్కసారి మన సెక్యూరిటీ ఇంఛార్జీని పిలువండి అంటాడు రాజ్. ఆఫీసులోనే సెక్యూరిటీ ఉండాలి.రేపు డెలివరీ ఇవ్వాలి సెక్యూరిటీ టైట్ చేయి అంటాడు రాజ్. అలాగే అని పీఏ పిలుస్తాడు. దీంతో ఆభరణాలు అన్ని లాకర్‌లో సెక్యూరిటీతో పెట్టిస్తారు. కీ అప్పజెప్పి లాక్ వేయమంటాడు. లాక్ చేసి కీ రాజ్‌కు ఇచ్చేస్తాడు సెక్యూరిటీ. దీంతో అక్కడి నుంచి రాజ్ కావ్యలు వెళ్లిపోతారు. అనామిక సామంత్‌లు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏయ్ ఏంటిది కావాలంటే మరో పెగ్ ఇస్తుండే కదా అంటాడు.ఏమైంది అంటుంది అనామిక ఆ రాజ్ ఫ్యామిలీని రోడ్డుకు ఈడుస్తా అన్నావ్, కానీ, వారు కాంట్రాక్ట్ పూర్తి చేసి ఇస్తున్నారు నాకు మతి పోతుంది. ఏంచేయాలి? అంటాడు సామంత్. నాకు కావాల్సింది వారి ఓటమి. ఈ అనామిక ఆలోచించకుండా ఏ పనిచేయదు అని నీక్కూడ తెలుసు. జస్ట్ వెయిట్ అండ్ సీ అని రాజ్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తుంది. పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నావా? అంటుంది. నేను ఒక పని చెప్తా, నీకు లైఫ్ సెటిల్‌మెంట్‌తోపాటు నీ పగ కూడా తీరుతుంది అంటుంది అనామిక. అంటే రిస్క్ ఉంటుందా? అంటాడు సెక్యూరిటీ. రూ.50 లక్షలు ఇస్తా రాజ్ కావ్యలు కాంట్రాక్ట్ పూర్తి చేశారు కదా.. నువ్వు ఆ ఒరిజినల్ కిరీటం దగ్గర డుబ్లికేట్ పెట్టి ఒరిజినల్ నాకు తెచ్చి ఇవ్వాలి అంటుంది అనామిక. అలాగే మేడమ్ అంటాడు వావ్ నువ్వు ఏమో అనుకున్నా ఇప్పుడు రాజ్ కంపెనీ నాశనం అయిపోతుంది కదా అంటాడు సామంత్. బెడ్‌రూమ్‌లో రాజ్‌తో కావ్య పడుకోకుండా పీపీటీ ప్రెజంటేషన్ గురించి మాట్లాడుతుంది. గుర్తుంది ఇప్పుడు పడకుంటా రేపు మార్నింగ్ లేచి చేస్తా అంటాడు. అయ్యో పనిని పోస్ట్‌పోన్ చేయడం మిస్టర్ పెర్ఫెక్ట్ పని కాదు అంటుంది. ముందు జాగ్రత్త పడటం నయం అంటుంది. అమ్మ తల్లి పీకల మీద కూర్చుని గృహ హింస పెట్టకు. నా మీద ఏమాత్రం జాలి, గౌరవం, అభిమానం ఉంటే నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు అంటాడు రాజ్. నువ్వు ఎంత అరిచిన నేను వినను అని పడుకుంటాడు. అవును.. ఆఫీస్ దగ్గర పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి అని కాల్ చేస్తుంది. ఆఫీసు సెక్యూరిటీతో జాగ్రత్తలు చెబుతుంది. ఇక ఆఫీసులో అనామిక సెక్యూరిటీ అందరికీ టీ ఇస్తాడు. అందులో నిద్ర మాత్రలు కలుపుతాడు.దీంతో అందరూ నిద్రపోతారు. అతడి చేతివాటం చూపిస్తాడు. డుబ్లికేట్ కిరీటం తీసుకుని ఓ వ్యక్తి సెక్యూరిటీ చేతికి ఇస్తాడు. వెంటనే ఆ కిరీటం డుబ్లికేట్ కీ తీసుకుని ఒరిజినల్ కిరీటం దగ్గర డుబ్లికేట్ కిరీటం పెడతాడు. ఆ బ్యాగ్‌తీసుకుకెళ్లి అనామిక మనిషికి అప్పజెప్పుతాడు. దాన్ని తీసుకుని వెళ్లిపోతాడు, అనామికకు కాల్ చేసి చెబుతాడు సెక్యూరిటీ. సక్సెస్ మేడం నీలో నచ్చేది ఇదే. నీకు ఇస్తానన్న డబ్బు ఇస్తా, నాకు రూ.50 లక్షలు ముఖ్యంకాదు ఆ రాజ్‌కావ్యలు రోడ్డున పడటం కావాలి. ఇక నీలైఫ్ సెట్టిల్ అయిపోయినట్లే ఐయమ్ సో హ్యాపీ టూడే అని సామంత్‌ను హగ్ చేసుకుంటుంది కావ్య. ఇదీ చదవండి: జియో బంపర్ హిట్ ప్లాన్ రూ.1234 రీఛార్జీ చేస్తే 11 నెలల వ్యాలిడిటీ.. మరిన్ని బెనిఫిట్స్ తెలిస్తే మైండ్‌బ్లోయింగ్.. ఉదయం రాజ్‌కు ఆఫీసు నుంచి కాల్ వస్తుంది. మీటింగ్ ఓ గంట పోస్ట్‌పోన్ అయింది సార్ అంటుంది శృతి. సరే అని మళ్లి పడుకుంటాడు. ఏవండి ముందు లేవండి ఇంకా పడుకున్నారు. టైమ్ ఇప్పటికే 7 అవుతుంది ఆఫీసుకు వెళ్లాలి అంటుంది కావ్య. కాసేపు కూడా కూర్చొనివ్వకుండా చేస్తావు అంటాడు రాజ్. ఇక కావ్య చకకిలిగింతలు పెడుతుంది. ఏయ్ ఏం చేస్తున్నావ్ అంటాడు రాజ్ పై కావ్య పడుతుంది. ఇక ఆటోలో వెళ్తున్న కావ్యకు అనామికకు ఫోన్ చేస్తుంది. అవకాశం కోసం చూశా.. ఇప్పుడు వెళ్లి మీ ఆయనతో అవమానం పంచుకో అని కాల్ చేస్తుంది. ఇక ఆఫీసులో రాజ్‌ను డుబ్లికేట్ కిరీటం సంగతి తెలిసి కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా అవమానిస్తాడు. ఇదీ చదవండి: భర్తతో థాయిలాండ్‌లో చిల్ అవుతున్న కీర్తి సురేష్.. మహానటి రచ్చ మాములుగా లేదుగా, ఫోటోస్ వైరల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి None
Popular Tags:
Share This Post:
China Virus: చైనా వైరస్ తో డేంజర్ బెల్స్.. దేశంలో ఐదు కేసులు..
- by Sarkai Info
- January 7, 2025
Brahmamudi: మాయ చేసిన కావ్య.. కంగుతిన్న అనామిక, రాజ్ చేతిలో అసలైన బంగారు కిరీటం..
January 7, 2025What’s New
Spotlight
Today’s Hot
Featured News
Latest From This Week
HMPV New Cases In Chennai: ఇద్దరు చిన్నారులకు సోకిన చైనా వైరస్.. భయాందోళనలో ప్రజలు..!
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Vishal Health: తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ప్రముఖ హీరో విశాల్.. అసలు ఏం జరిగింది?
TELUGU
- by Sarkai Info
- January 6, 2025
Subscribe To Our Newsletter
No spam, notifications only about new products, updates.