TELUGU

Ram Charan: ఏపీలోనే కాదు..భారతదేశం పొలిటిక్స్‌లో ఉన్న ఏకైక గేమ్‌ ఛేంజర్‌ పవన్‌ కళ్యాణ్: రామ్ చరణ్

Game Changer Event : ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్నో సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ సోలో హీరోగా వస్తున్న సినిమా గేమ్ చేంజర్. పాన్ ఇండియా వైడ్ లో విడుదల అవుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. కాగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కియారా అద్వానీ, అంజలి నటించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యాక్టర్‌ ఎస్ జే సూర్య విలన్‌గా నటించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలో.. రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో రామ్‌ చరణ్ మాట్లాడుతూ... 'ఈ జన సంద్రాన్ని చూస్తుంటే.. నాకు అప్పుడు ఒకసారి రాజమండ్రి బ్రిడ్జ్ మీద మన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ గారు మొదటి సారి ర్యాలీ చేసినప్పటి సందర్భం గుర్తుకొస్తోంది. మా చిత్రం షూటింగ్ ఇక్కడే చాలా రోజులు చేశాం. ముందుగా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా సినిమా కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యేలకు నా ధన్యవాదాలు. చాలా మాట్లాడాలని ఉంది కానీ నా ముందర మీరు, అలానే నా వెనక బాబాయ్ ఉండడంతో మాటలు ఏమీ రావడం లేదు. ఈ సినిమాకు శంకర్‌ గారు ఎందుకని గేమ్‌ ఛేంజర్‌ అని టైటిల్‌ పెట్టారో తెలియదు. అయితే తెర మీద మేము చేసే పాత్ర గేమ్‌ ఛేంజింగ్‌ పాత్ర కావచ్చు. కానీ నిజ జీవితంలో మాత్రం.. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మొత్తం భారతదేశం పొలిటిక్స్‌లో ఉన్న ఏకైక గేమ్‌ ఛేంజర్‌ పవన్‌ కళ్యాణ్ గారు,” అంటూ చెప్పుకొచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తి పక్కన.. నిలబడడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడే వ్యక్తి.. కుటుంబానికి చెందిన వాడు కావడం నా అదృష్టం. శంకర్‌ గారు గేమ్‌ ఛేంజర్ కథను పవన్‌ కళ్యాణ్ లాంటివారిని చూసి రాసి ఉంటారు ధ. ఇంకా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేక పోతున్నాను. నేను కూడా మీలానే పవన్ కళ్యాణ్ గారి మాటలను వినాలని ఎదురుచూస్తున్నాను,” అని అన్నారు. Read more: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.