TELUGU

Hyundai Creta Electric SUV Price: 473 కి.మీ మైలేజీతో హ్యుందాయ్ క్రెటా Ev కారు వచ్చేస్తోంది.. ధర, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!

Hyundai Creta Electric SUV Price And Specifications: ప్రముఖ కొరియన్ ఆటో మొబైల్ కంపెనీ హ్యుందాయ్ మార్కెట్‌లోకి వరసగా కార్లను విడుదల చేస్తూ వస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లోనే విడుదల చేస్తూ వస్తోంది. గతంలో విడుదల చేసిన హ్యుందాయ్ క్రెటా కారుకు మార్కెట్‌లో ఎంత ప్రజాదరణ లభించిందో అందరికీ తెలిసిందే.. అయితే దీనినే ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రెటా EV (Hyundai Creta Electric SUV) కారు గతంలో లాంచ్‌ చేసిన డిజైన్‌కి భిన్నంగా ఉండబోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కారుకు సంబంధించిన కొన్ని (Hyundai Creta EV Pics)ఫోటో, ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. అయితే ఈ క్రెటా EV కారు ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిందో? దానికి సంబంధించిన ఫీచర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్‌తో కూడిన ఫ్రంట్‌ ఫ్రంట్ ఫాసియాతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా దీని ముందు భాగంలోనే న్యూ స్టైల్‌లో 'హ్యుందాయ్' లోగోను కలిగి ఉంటుంది. అలాగే వెనక భాగంలో ప్రత్యేకమైన ఛార్జింగ్‌ సాకెట్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాటరీ కూలింగ్‌ కోసం ఈ కారులో ప్రత్యేకమైన ఎయిర్‌ఫ్లోను ఆప్టిమైజ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. అంతేకాకుండా ఈ కారుకు ఎంతో స్పెషల్ L-ఆకారంలో కనెక్ట్ చేసిన LED DRLలతో పాటు హెడ్‌లైట్ హౌసింగ్‌లను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రెటా EV కారు ఏరోడైనమిక్ స్టైల్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే దీనిపై కప్పు చూడడానికి ఆకర్శనీయమైన డిజైన్‌తో బ్లాక్‌ కలర్‌లో కనిపించబోతోంది. దీంతో పాటు ఇక ఈ కారు వెనక వైపు చూస్తే.. L-ఆకారంతో కూడిన LED టెయిల్ లైట్లు కూడా లభించబోతున్నాయి. అంతేకాకుండా క్రెటా ఎలక్ట్రిక్ గతంలో విడుదల చేసిన ICE వెర్షన్‌ లాగా కనిసిస్తుంది. అంతేకాకుండా బంఫర్‌ భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ వైట్ క్యాబిన్ థీమ్‌తో లాంచ్‌ కాబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన డిజైన్‌తో లాంచ్‌ కానుంది. Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం ఇక ఈ కారు స్టీరింగ్ వీల్ ప్రీమియం లుక్‌తో 3-స్పోక్ యూనిట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ EV క్రెటాకు సంబంధించిన బ్యాటరీ ప్యాకప్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 42 kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీతో విడుదల కాబోతోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 473 కి.మీ మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా ఈ కారుకు బ్యాటరీ DC ఫాస్ట్ ఛార్జర్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల దాదాపు 58 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్‌ అవుతుంది. ఇక ఈ కారుకు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ (Hyundai Creta Electric SUV Price) రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వేరియంట్‌ హైదారబాద్‌ (Hyundai Creta Electric SUV Price In Hyderabad)ధర రూ. 21 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే మహీంద్రా BE 6తో పాటు MG ZS EV కార్లతో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఈ నెల 17వ తేది విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.