TELUGU

Big Breaking: యుద్ధం మొదలైంది.. ఇజ్రాయేల్‌పై డ్రోన్లు, 300 రాకెట్లతో విరుచుకుపడ్డ హెజ్‌బొల్లా..

Israel Attack: ఉత్తర ఇజ్రాయేల్‌ను లక్ష్యంగా చేసుకుని హెజ్‌బొల్లా దాడులకు ఈరోజు విరుచుకుపడింది. ఇజ్రాయేల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం మరింత మదురుతోంది. వందల క్షిపణులతో ఇజ్రాయేల్‌ దాడికి తెగబడుతోంది. దానికి ప్రతి దాడి కూడా హెజ్‌బొల్లా మొదలెట్టింది. రెండూ రాకెట్లతో దాడి ప్రతి దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. శవల కుప్పల దృశ్యాలు అత్యంత దయనీయంగా కనిపిస్తున్నాయి. ఊహించని రీతిలో ఉదయం నుంచి హెజ్‌బొల్లాపై దాడులు చేసింది ఇజ్రాయేల్‌. దీనికి సెల్ప్‌ డిఫెన్స్‌లో భాగంగానే దాడి చేస్తున్నామని చెబుతోంది ఇజ్రాయేల్‌. ఇరాన్‌ మద్ధతు గల హిజ్బుల్లా ఆయుధ కేంద్రాలను టార్గెట్‌గా పేల్చివేస్తోంది ఇజ్రాయేల్‌. ఇప్పటికే శవల కుప్పలతో, కూలిపోయిన భవనాలతో హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు భీష్మ క్యూబ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ...దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? అక్కడి భవనాలు పూర్తిగా నెలమట్టం అయ్యాయి. శవలు కుప్పలుకుప్పలుగా తునాతునకలై పడి ఉన్నాయి. బతికి ఉన్నవారికి కూడా ఆహారం కష్టంగా మారింది. వందలాది క్షిపణులతో దాడి చేస్తున్నాయి. ఇజ్రాయేల్‌పై డ్రోన్లు రాకెట్లతో హెజ్‌బొల్లా దాడికి తెగబడుతుంది. ముందస్తు ప్లాన్‌గానే జరుగుతోంది. అందుకే ఇజ్రాయేల్ ముందస్తుగా కనిపెట్టి ఉదయమే దాడికి దిగింది. సెల్ఫ్‌ డిఫెన్స్‌లో భాగంగానే జరుగుతోందని ఇజ్రాయేల్‌ చెబుతోంది. ఎక్కడ చూసినా పెద్దపెద్ద మంటలు. ముఖ్యంగా హెజ్‌బొల్లా ట్యాంకర్లను పేల్చివేస్తున్న ఇజ్రాయేల్‌. అక్కడి చిన్నపిల్లలు, మహిళల పరిస్థితులు దయనీయంగా మారింది. విమాన సేవలు కూడా నిలిపివేశారు. ఇదీ చదవండి: ఈ జపనీస్‌ బామ్మకు 116 ఏళ్లు.. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ఆమె లైఫ్‌స్టైల్‌ ఎలా ఉండేదో తెలుసా? ఊహించని రీతిలో ఉదయం నుంచి ఇజ్రాయేల్‌ దాడికి దిగింది. మాపై దాడులకు హెజ్‌బొల్లా ప్లాన్‌ చేసింది. స్వీయ రక్షణ లో భాగంగా దాడి చేయాల్సి వస్తోందని ఇజ్రాయేల్‌ చెబుతోంది. ఇప్పటికే గాజాలో శవాల కుప్పలు, ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రజలు పారిపోవడం వంటి దృశ్యాలు అత్యంత దయనీయంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయేల్‌ దాడులకు ఇరాన్‌ మద్ధతు గల హిజ్బుల్లా కూడా వందల కొద్ది రాకెట్‌ దాడులతో తెగబడుతోంది. ఈ పరస్పర దాడులు ఆకాశంలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధం మరింత ముదురుతోంది. ఉత్తర ఇజ్రాయేల్‌ను లక్ష్యంగా చేసుకున్న హెజ్‌బొల్లా రాకెట్లతో ప్రతి దాడులకు దిగుతోంది. హిజ్బుల్లా 1982 లో ఇజ్రాయేల్‌ లెబనాన్‌పై దాడి చేసిన సమయంలో ఏర్పడింది. అయతోల్లా రొహల్లా కొమేయినీ ఈ విధానాన్ని ప్రాంభించారు. హెజ్‌బొల్లా అంటే పార్టీ ఆఫ్ గాడ్‌ అని అర్థం. ఇది లెబనాన్‌ షియా టెర్రరిస్ట్‌ గ్రూప్‌ యుద్ధం కారణంగా ఇప్పటివరకు 40వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహిళల పరిస్థితులు మరింత దారుణంగా ఉంది. ఆహారం దొరకని పరిస్థితులు కూడా ఉన్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter , Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.