TELUGU

Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ప్రకటన.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై

Ravichandran Ashwin Retirement: టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. 38 ఏళ్ల ఈ లెజెండరీ స్పిన్నర్ రిటైర్మెంట్ ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆసీస్‌తో మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ రిటైర్మెంట్‌ ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. అశ్విన్‌ను భారత జట్టులో అమూల్యమైన ఆల్ రౌండర్‌గా పేర్కొంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసి లెజెండరీ బౌలర్ల సరసన చేరాడు. మొత్తం 106 టెస్టులు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 537 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో కూడా మెరుపులు మెరిపించాడు. 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున అనిల్ కుంబ్లే (619) తరువాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ ఉన్నాడు. వన్డేల్లో 116 మ్యాచ్‌లు ఆడగా.. 156 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 707 పరుగులు చేయగా.. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. 65 టీ20 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 72 వికెట్లు పడగొట్టాడు. “అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. ఒక క్రికెటర్‌గా నాలో ఇంకా కొంచెం శక్తి ఉంది. అయితే అది క్లబ్ స్థాయి క్రికెట్‌లో ఉపయోగించుంటా. నేను చాలా సరదాగా గడిపాను. రోహిత్ శర్మతోపాట సహచరుల అందరితో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా కొందరు సహచరులను మిస్ అయ్యాను. నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ క్రికెట్ ప్రయాణంలో భాగమైన కోచ్‌లందరూ, ముఖ్యంగా రోహిత్, విరాట్, అజింక్యా, పుజారా అద్భుతమైన క్యాచ్‌లను అందుకుని.. నాకు వికెట్ల సంఖ్యను అందించారు. అలాగే గట్టి పోటీదారుగా ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు. నేను ఆసీస్‌తో మ్యాచ్‌లను ఎంతో ఎంజాయ్ చేశాను." అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్. Also Read: Poco C75 5G Just @7,499: ఆఫర్‌ అంటే ఇది గురూ.. రూ.7,499కే ఫ్లిఫ్‌కార్ట్‌లో Poco C75 5G మొబైల్‌.. డోంట్‌ మిస్‌.. Also Read: Tirumala: ఇకపై తిరుమలలో ఆ బాధ్యత ప్రభుత్వానిదే, టీటీడీ నుంచి బదిలీ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.