TELUGU

Realme Neo 7 Se Price: రూ.25 వేలకే Realme అద్భుతమైన మొబైల్‌.. ఫీచర్స్‌ చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

Realme Neo 7 Se Price In India: ప్రస్తుతం ప్రీమియం చిప్‌సెట్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే డైమెన్సిటీ 8400-అల్ట్రా పవర్డ్‌తో కూడిన మొబైల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ చిప్‌సెట్‌పు సంబంధించిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్‌ కాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఏంటో? ఎప్పుడు లాంచ్‌ కాబోతుందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డైమెన్సిటీ 8400-అల్ట్రా పవర్డ్ చిప్‌సెటప్‌ కలిగి మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ రియల్ మీ బ్రాండ్‌ నుంచి విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ Realme Neo 7 SE పేరుతో లాంచ్‌ కాబోతోంది. ఈ మొబైల్‌ 7,000mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అతి తక్కువ ధరలో భారత్‌ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రారంభ ధర 2,199 యువాన్(చైనా కరెన్సీలో) ఉండగా.. భారత్‌లో ధర రూ.25,829 ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌తో మరో స్మార్ట్‌ఫోన్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇది Neo 7 SE పేరుతో విడుదల కానుంది. ఈ Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్‌ను 2025లో ఫిబ్రవరి నెలలో చైనాలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌ను Realme GT Neo 6 SE మొబైల్‌కి సక్సెసర్‌గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్లో Realme GT 7T స్మార్ట్‌ఫోన్‌గా రీబ్యాడ్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం ఈ Realme Neo 7 SE మొబైల్‌కు సంబంధించిన డిస్ల్పే వివరాల్లోకి వెళితే.. ఇది 6.67-అంగుళాల డిస్ల్పేతో విడుదల కానుంది. అలాగే ఈ డిస్ల్పే AMOLED 1.5K 120Hz సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌ 16 GB ర్యామ్‌తో పాటు 512 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో విడుదల కాబోతోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు బ్యాక్‌ సెటప్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌లను కలిగి ఉంటుంది. Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.