TELUGU

Viral Video: ఈ అమ్మాయి అచ్చం జహీర్‌ లాగే ఎలా బౌలింగ్‌ వేస్తుందో చూడండి.. ఏకంగా క్రికెట్‌ గాడ్‌ కూడా ఫ్లాట్!

Viral Video: భారత మాజీ కెప్టెన్, క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్..తాజాగా ఓ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అచ్చం జహీర్ ఖాన్ వలే బౌలింగ్ యాక్షన్ తో బౌలింగ్ చేస్తున్న ఓ అమ్మాయి వీడియోను షేర్ చేశారు. తన బౌలింగ్ యాక్షన్ చాలా అద్బుతంగా ఉందన్నారు. చాలా స్మూత్ గా, ఎఫెక్టివ్ బౌలింగ్ యాక్షన్ అంటూ ప్రశంసించారు సచిన్. అంతేకాదు ఈ వీడియోను చూడమంటూ జహీర్ ఖాన్ కు ట్యాగ్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఆ బాలిక పేరు సుశీల మీనా అని ఆ వీడియోను షేర్ చేస్తూ సంతోషిస్తున్నారు. అచ్చం జహీర్ ఖాన్ లాగే బౌలింగ్ చేస్తుందని ఆ వీడియోను చూస్తూ సంబురపడుతున్నారు. భారత క్రికెట్ కు సచిన్, జహీర్ ఖాన్ చేసిన సేవ అంత సులభంగా ఎవరూ మర్చిపోరు. ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా రికార్డులు వీరి పేరుమీదే ఉన్నాయి. కొన్ని రికార్డులు అయితే ఎప్పటికీ చెక్కుచెదరవు. అత్యధిక వన్డేలు, అత్యధిక టెస్టులు, అత్యధిక ఇంటర్నేషనల్ రన్స్, అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలేడు ఉన్నాయి. Also Read: Bank Merger: ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్..తెలంగాణలో ఈ బ్యాంక్ కనిపించదు..డిసెంబర్ 27లోపు పనులన్నీ పూర్తి చేసుకోండి Smooth, effortless, and lovely to watch! Sushila Meena’s bowling action has shades of you, @ImZaheer . Do you see it too? pic.twitter.com/yzfhntwXux — Sachin Tendulkar (@sachin_rt) December 20, 2024 ఇక జహీర్ ఖాన్ మిలీనియంలో అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే ప్రధాన బౌలర్ గా ఎదిగాడు. లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ తో ఎన్నో మ్యాచుల్లో భారత్ విజయానికి కారణమయ్యారు. You’re spot on with that, and I couldn’t agree more. Her action is so smooth and impressive—she’s showing a lot of promise already! — zaheer khan (@ImZaheer) December 20, 2024 Also Read: PM Kisan: రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - ఆపిల్ లింక్ - సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.